News

బొట్టు పెట్టాడని కొట్టారు!

399views
  • ఓ ముస్లిం టీచర్‌ దుర్మార్గం

  • విద్యార్థికి తీవ్ర గాయాలు, ఆస్పత్రికి తరలింపు

రైసెన్‌: నుదుట బొట్టు పెట్టుకుని, పాఠశాలకు వచ్చాడని ఒక విద్యార్థిని ముస్లిం ఉపాధ్యాయురాలు బయట పిల్లలతో తీవ్రంగా కొట్టించింది. ఈ దుర్ఘటన మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. రైసెన్‌ జిల్లాలోని గరత్‌గంజ్‌లోని ప్రభుత్వ పాఠశాల న్యూ బాయ్స్‌ సెకండరీకు చెందిన ముస్లిం టీచర్‌ నిషాత్‌ బేగం హిందూ విద్యార్థి పవన్‌పై మత వివక్ష చూపడం, అబ్బాయిలతో కొట్టించిన కేసు వెలుగులోకి వచ్చింది. బాధితుడు, పోలీసుల కథనం ప్రకారం..

ఆ ఉపాధ్యాయురాలు పాఠశాలలో తిలకం పెట్టుకోవడానికి నిషేధించింది. వినకపోతే బయట పిల్లలతో కొట్టిస్తానని బెదిరించింది. ఇలా హుకుం జారీ చేసిన తర్వాత కూడా విద్యార్థి తిలకంతో వెళ్ళగా, అన్నట్టుగానే కొట్టించింది. దీంతో ఆ విద్యార్థి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రిలో చేర్పించారు. ఎనిమిదో తరగతి చదువుతున్న ఆ విద్యార్థి పాఠశాలకు వెళ్ళే ముందు గుడికి వెళ్తాడు.

అక్కడ పూజారి పవన్‌ నుదుట బొట్టు పెడతాడు. అలా వెళ్ళినప్పుడే బయట విద్యార్థులు పాఠశాల వద్ద గట్టిగా కొట్టారని పోలీసుల వద్ద బాధిత విద్యార్థి పవన్‌ బోరుమన్నాడు. ఈ ఘటన జిల్లా విద్యాశాఖాధికారి ఎంఎల్‌ రథూరియా దృష్టికి వెళ్ళింది. దీనిని శాఖ స్థాయిలో దర్యాప్తు చేస్తామని చెప్పారు. కేసు దర్యాప్తులో ఉంది.

Source: Panchjanya

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి