News

హవానా సిండ్రోమ్‌తో అగ్రరాజ్యం గజగజ!

562views
  • మరో కొత్త విపత్తు

  • సైనికులను అలెర్ట్‌ చేసిన పెంటగాన్‌

  • దౌత్యవేత్తలకు మాత్రమే సోకిన సిండ్రోమ్‌

  • వ్యాధి బారినపడితే మెదడుకు దెబ్బ

పెంటగాన్‌: హవానా సిండ్రోమ్‌ అనే వ్యాధితో అమెరికా గజగజ వణుకుతోంది. ఆ దేశ దౌత్యవేత్తలు మాత్రమే ఈ సిండ్రోమ్‌ బారినపడుతున్నారు. ఈ రోగం బారినపడితే మెదడు తీవ్రంగా దెబ్బతింటోంది. కొందరు వినికిడి కోల్పోతున్నారు. 2016లో క్యూబా రాజధాని హవానాలో పనిచేస్తున్న అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేసేవారిలో దీన్ని గుర్తించారు. హవానాలో తొలుత గుర్తించడంతో దీనికి హవానా సిండ్రోమ్‌ అని పేరు పెట్టారు.

ఈ సిండ్రోమ్‌ బారిన పడుతున్న బాధితుల్లో ఎక్కువ మంది క్యూబా, చైనా, రష్యా, ఆస్ట్రియా, పోలాండ్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాల్లో పనిచేసేవారే ఉన్నారు. హవానా సిండ్రోమ్‌ ద్వారా శత్రువులు తమను టార్గెట్‌ చేస్తున్నట్టు అమెరికా అనుమానిస్తోంది.

దౌత్యవేత్తలతో పాటు తమ సైనికులు కూడా భారీ సంఖ్యలో ఈ సిండ్రోమ్‌ బారినపడే ప్రమాదముందని అగ్రరాజ్యం ఆందోళన చెందుతోంది. దీంతో రెండ్రోజుల క్రితం హవానా సిండ్రోమ్‌పై తమ సైనికులను పెంటగాన్‌ అప్రమత్తం చేసింది. ఒక్కసారిగా మెదడు సమస్యలతో సతమతమవుతున్న సైనికులు వెంటనే తమకు సమాచారమివ్వాలని కోరింది.

Source: Tv9

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి