
-
అక్టోబర్ 1 నుంచి అలిపిరి మార్గం ప్రారంభం
తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు పెద్ద సంఖ్యలో అలిపిరి మెట్ల మార్గంలో నడుస్తూ కొండపైకి వెళుతుంటారు. కొండ పైకి ఎక్కి తమ మొక్కులు తీర్చుకుంటారు. భక్తులు కొండపైకి వెళ్ళడానికి రెండు మెట్లు మార్గాలు ఉన్నాయి. ఒకటి అలిపిరి మెట్లు మార్గం. రెండోది శ్రీవారి మెట్టు మార్గం. అయితే, ఎక్కువమంది అలిపిరి మార్గం ద్వారానే కొండ ఎక్కుతుంటారు. అయితే, మరమ్మతులు ఆధునీకరణ కోసం అలిపిరి మార్గాన్ని కొన్ని నెలల కిందట తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) అధికారులు మూసివేశారు.
దీంతో ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం ద్వారానే భక్తులు కొండపైకి నడుచుకుంటూ వెళ్తున్నారు. అక్టోబర్ 1 నుంచి అలిపిరి నడక మార్గంలో భక్తులు అనుమతించినట్టు టీటీడీ ప్రకటించింది. ఇదిలావుండగా, ఈ నెల 13 నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో అగరబత్తీలు భక్తులకు అందుబాటులోకి వస్తాయని చెప్పింది. సప్తగిరి గుర్తుగా ఏడు రకాల అగరబత్తీలు తీసుకొస్తున్నామని తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. బ్రహ్మోత్సవాలు నుంచి శ్రీవారి క్యాలెండర్లు, డైరీలను అందుబాటులో ఉంటాయని తెలిపింది.





