
-
పాస్టర్ ముసుగులో యువతులపై అఘాయిత్యం!
-
చిన్న వెంకటేశ్వర్లు అలియాస్ జోసెఫ్ అరెస్టు
భాగ్యనగరం: భాగ్యనగరంలో చిన్న వెంకటేశ్వర్లు అలియాస్ జోసెఫ్ అనే వ్యక్తి పాస్టర్ ముసుగులో చర్చికి వచ్చే యువతలపై కన్నెసి, లైంగికంగా దాడులు చేసున్నాడు. ఈ వ్యక్తి చొడుప్పల్‌లోని లక్ష్మీ నగర్‌లో నివాసముంటున్నాడు. ఉప్పల్‌లోని గోస్పల్ చర్చిలో పాస్టర్‌గా పనిచేస్తూ చర్చిని నిర్వహిస్తున్నాడు. బోడుప్పల్‌లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో స్టాఫ్‌నర్స్‌గా పనిచేస్తున్న యువతి తరచూ గోస్పల్ చర్చికి వెళ్ళేది. ఆమెపై చిన్న వెంకటేశ్వర్లు కన్నేసి, పరిచయం పెంచుకున్నాడు.
గతేడాది జనవరి 23వ తేదీన శంషాబాద్‌లోని చర్చికి వెళ్తున్నానని యువతికి చెప్పిన ఆమెను కారులో తీసుకెళ్లాడు. నిర్మానుష్య ప్రాంతంలో కారు ఆపి యువతిని బెదిరించి, లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ అఘాయిత్యాన్ని బాధితురాలు తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్టర్‌ని నిలదీసి, పోలీస్ కేసు పెడతామని హెచ్చరించారు. దీంతో ఆమెను పెళ్లి చేసుకుంటానని జోసెఫ్ హామీ ఇచ్చాడు.
అయితే, కాలం గడుస్తున్నా పాస్టర్ పెళ్లిమాట ఎత్తకపోవడంతో బాధితురాలు ఈ నెల రెండో తేదీన ఇంటికి వెళ్లి నిలదీసింది. దీంతో విషయం బయట పెడితే చంపేస్తామంటూ జోసెఫ్ తండ్రి, సోదరుడు బాధితురాలిని బెదిరించారు. భయపడిన బాధితురాలు నేరుగా మేడిపల్లి పీఎస్‌కు వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి జోసెఫ్‌తో పాటు అతని తండ్రి, సోదరుడిని అరెస్టు చేశారు. పాస్టర్ బాగోతం గురించి పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.
పాస్టర్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు
పాస్టర్ జోసెఫ్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు జరిగినట్టుగా పోలీసులు గుర్తించారు. మత ప్రచారకుడిగా నీతులు చెప్పే జోసెఫ్ ఆ ముసుగును అడ్డం పెట్టుకుని ఎందరో అమ్మాయిలను మోసం చేశాడని, అతడిని కఠినంగా శిక్షించాలని మహిళా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
SOURCE: Smtv





