News

‘ఆధార్‌’లో తండ్రి, భర్త కాలమ్‌ తొలగింపు

733views
  • ఆ స్థానంలో కేరాఫ్‌ అనే పదం

న్యూఢిల్లీ : భారతదేశంలోని అతి ముఖ్యమైన ధ్రువపత్రాలలో ఆధార్‌ కార్డు ఒక్కటి. అయితే, ఇప్పుడు ఆధార్‌ కార్డులో మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఆధార్‌ కార్డును అప్‌డేట్‌ చేస్తే ఇకపై అందులో తండ్రి పేరు/భర్త పేరు అని ఉండదు. ఇకపై తండ్రి లేక భర్త అనే ఆప్షన్‌ వద్ద కేరాఫ్‌ అనే పదం మాత్రమే ఉంటుంది.
ఓ ఖాతాదారుడు ఈ విషయాన్ని గుర్తించి పొరపాటుగా కేరాఫ్‌ అని పడిరదేమో అనుకుని ఆధార్‌ కేంద్రానికి విషయం తెలిపాడు. అయితే, తండ్రి పేరు, భర్త పేరు అనే పదాలను తొలగించి కేరాఫ్‌ అని ఉద్దేశపూర్వకంగానే మార్చామని అధికారులు తెలిపారు.
ఇకపై ఆధార్‌ కార్డులో బంధుత్వాన్ని తెలిపే పదాలు ఉండబోవని, కేరాఫ్‌ అని ఉంటుందని చెప్పారు. కార్డుదారుడు కేరాఫ్‌లో తన బంధుత్వాన్ని తెలియకుండానే సంరక్షకుడి పేరును రాస్తూ సరిపోతుందని అధికారులు వివరించారు. పౌరుడి వ్యక్తిగత గోప్యతకు ఏ విధంగానూ భంగం కలగకూడదని గతంతో సుప్రీంకోర్టు చేసిన సూచనల మేరకు అధికారులు మార్పులు చేసినట్టు తెలుస్తోంది.

SOURCE: Vaatha

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి