News

పారాలింపిక్స్ : భారత్ ఖాతాలో 12 పతకాలు 

559views

తాజాగా వచ్చిన సిల్వర్ మెడల్ తో సహా పారాలింపిక్స్ లో భారత్ ఖాతాలో ఇప్పటివరకూ మొత్తం 11 పతకాలు ఉన్నాయి. పురుషుల హైజంప్ లో ప్రవీణ్ కుమార్ 2.07 మీటర్ల ఎత్తు జంప్ చేసి రజత పతకం సాధించాడు. హైజంప్ లో భారత్ కు ఇది నాలుగో మెడల్ కాగా ఇంతకముందు మరియప్పన్, నిషద్, శరద్ పతకాలు సాధించారు. ఇక మనవారు సాధించిన మొత్తం 12 పతకాలలో 2 గోల్డ్, 6 సిల్వర్, 4 బ్రాంజ్ పతకాలున్నాయి. మరోవైపు 18 ఏళ్ల ప్రవీణ్ కుమార్ భారత్ తరఫున పాల్గొన్న యంగెస్ట్ పారాలింపియన్ గా ఘనత సాధించాడు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.