
ఛత్తీస్గఢ్ లోని భిలాయ్ నగరంలో కంటోన్మెంట్ పోలీస్ స్టేషన్ పరిధిలో లవ్ జిహాద్ కేసు నమోదయింది. పోలీసులకు అందిన వివరాల ప్రకారం… మొహమ్మద్ అక్బర్(25) 20 ఏళ్ల అమ్మాయిని ప్రేమ పేరుతో వలలో వేసుకున్నాడు. ఆ తర్వాత డిసెంబర్ 2020 లో కోల్ కతాకు తీసుకెళ్లాడు. ఇద్దరూ కోల్ కతాలో వివాహం చేసుకుని, భిలాయ్ కు తిరిగి వచ్చారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అక్బర్ కుటుంబం బాధితురాలిని తన మతపరమైన ఆచారాలను విడిచిపెట్టాలని నిరంతరం ఒత్తిడి చేయడం ప్రారంభించింది. దీనికి అక్బర్ కూడా వత్తాసు పలికాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వివాహానికి ముందు, అక్బర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తన మతాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదని, తన ఆచారాలను అనుసరించే స్వేచ్ఛ తనకు ఉందని హామీ ఇచ్చాడని బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. కోల్ కతాలో ఉన్నప్పుడు అక్బర్ అనేకసార్లు అసహజ శృంగారంలో పాల్గొన్నాడని బాధితురాలు ఆరోపించింది. బాధితురాలిని తన మతాన్ని విడిచిపెట్టమని నిరంతరం మానసికంగా, శారీరకంగా హింసించారు. అంతేకాకుండా, బాధితురాలి చేత మహ్మద్ అక్బర్ గొడ్డు మాంసాన్ని బలవంతంగా తినిపించాడని కూడా బాధితురాలు ఆరోపించింది. కాగా, నిందితుడిపై అసహజ సెక్స్, వరకట్న వేధింపులు మొదలైన తీవ్రమైన సెక్షన్ల కింద కేసు నమోదు చేశామని, ప్రస్తుతం ఈ ఘటన జరిగినప్పటి నుండి పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసు బృందం వెతుకుతోందని స్థానిక కంటోన్మెంట్ స్టేషన్ ఇన్‌చార్జ్ విశాల్ సన్ తెలిపారు.





