
సెంట్రల్ కాశ్మీర్‌లోని బుద్గామ్ జిల్లాలోని ఖాన్‌సాహిబ్ ప్రాంతంలోని ఓ స్థానికుడి నుండి 1200 సంవత్సరాల నాటి పురాతన శిల్పాన్ని జమ్మూ కాశ్మీర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
యరిఖా ఖాన్‌సాహాబ్ నివాసి అబ్దుల్ రషీద్ షేక్ కుమారుడు నవాజ్ అహ్మద్ షేక్ ఇంట్లో తనిఖీలు నిర్వహిస్తున్దాగా అయన ఇంట్లో ఈ పురాతన శిల్పం లభ్యమైందని ఓ అధికారి మీడియాకి వెల్లడించారు.
అతను దానిని విక్రయించడానికి ప్రయత్నిస్తున్నాడని, ఇంతలో పోలీసులు అతని నుండి దాన్ని స్వాధీనం చేసుకున్నారని ఆయన చెప్పారు.
“నిన్న మధ్యాహ్నం, నిర్దిష్ట సమాచారం మేరకు, బుద్గాం పోలీసులు ఖాన్‌సాహిబ్ ప్రాంతం నుండి ఒక పురాతన శిల్పాన్ని స్వాధీనం చేసుకున్నారు.
ఈ శిల్పం 12 “x 08” సైజులో నల్లరాతితో చెక్కబడిందని వారు చెప్పారు. ఈ శిల్పం దుర్గాదేవి సింహాసనంపై కూర్చుని వుండి, నలుగురు సేవకులతో ఉంటుంది.
స్వాధీనం చేసుకున్న శిల్పాన్ని ఆర్కియాలజీ & మ్యూజియమ్స్ డిపార్ట్‌మెంట్ ఆర్కైవ్స్ డిప్యూటీ డైరెక్టర్ ముష్తాక్ అహ్మద్ బే మరియు అతని బృంద సభ్యులు బుద్గాం ఎస్ ఎస్ పి తాహిర్ సలీమ్ ఖాన్, బుద్గాం ఎస్‌ఎస్‌పి గౌహర్ అహ్మద్ , అఫ్తాబ్ అవన్- ఎస్‌డిపిఒ ఖాన్‌సాహిబ్ మరియు ఇతరులకు పోలీసులు అధికారికంగా అందజేశారు.
2021 ఆగస్టు 13 న శ్రీనగర్ వద్ద ఉన్న జీలం నదిలో ఇసుకను వెలికితీస్తున్న కూలీలు ఈ శిల్పాన్ని వెలికితీసినట్లుగా తెలియవస్తోంది.
Source : Organiser.





