640
జమ్ముకాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతోంది. అవంతిపొరాలోని త్రాల్లో మన భద్రతా బలగాలు ముగ్గురు ముష్కరుల్ని మట్టుబెట్టాయి . గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వీరంతా నిషేధిత ఉగ్ర సంస్థ జైషే మహ్మద్ కు చెందిన వారని జమ్ముకశ్మీర్ పోలీసులు తెలిపారు. ఇటీవలి కాలంలో.. కాశ్మీర్ లో మళ్లీ ఉగ్రవాదుల కదలికలు కనిపిస్తున్నాయి. అప్రమత్తంగా ఉన్న భారత సైన్యం.. ముష్కరుల ఏరివేత చేపడుతోంది. ఈ క్రమంలోనే పుల్వామా జిల్లా పాంపొర్లో ఇద్దరు ఉగ్రవాదులను హతమార్చింది.