News

భద్రతా దళాలకు పురస్కారాలు ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం

484views

దేశ రక్షణ, శాంతిభద్రతల పరిరక్షణలో అత్యుత్తమ ధైర్యసాహసాలు, అంకితభావాన్ని ప్రదర్శించిన సైనిక, పోలీసు దళాలకు కేంద్ర ప్రభుత్వం పతకాలను ప్రకటించింది. వీరిలో పలువురు విధి నిర్వహణలో మరణించారు. ఉగ్రవాదంపై అలుపెరగని పోరు సాగిస్తున్న జమ్ముకశ్మీర్‌ పోలీసులకు ఈ దఫా అత్యధిక స్థాయిలో పతకాలు దక్కాయి. మూడు అత్యున్నత పతకాలు అశోక్‌ చక్ర, కీర్తి చక్ర, శౌర్య చక్రలను ఒకేసారి ఈ దళాన్ని వరించాయి. ఇలా మూడింటినీ ఒకే విడతలో దక్కించుకోవడం ఇదే మొదటిసారి. మొత్తం మీద కేంద్ర, రాష్ట్ర పోలీసు దళాల్లోని 1,380 మందికి పతకాలను ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.