News

ఆఫ్ఘన్ అవస్థకు బైడెనే కారణం.. డొనాల్డ్ ట్రంప్ విమర్శ

809views

ఫ్గనిస్థాన్​లోని తాలిబన్ల విషయంలో అమెరికా అనుసరిస్తున్న విధానాన్ని ఆ దేశ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుపట్టారు. తాలిబన్లు అఫ్గాన్​లోని నగరాలను, ప్రావిన్సులను స్వాధీనం చేసుకోవడంపై స్పందించిన ఆయన.. ఈ విషయంలో అధ్యక్షుడు జో బైడెన్​ పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు.

అఫ్గనిస్థాన్​లో 5 వేల మంది అమెరికా బలగాలను మోహరిస్తున్నాట్లు అధ్యక్షుడు జోబైడెన్​ తెలిపిన కొన్ని గంటల్లోనే ట్రంప్​ ఈ వ్యాఖ్యలు చేశారు. విదేశాంగ విధానం, ఇతర సమస్యలపై బిడెన్ ప్రతిసారీ తప్పు చేస్తారని అన్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.