
431views
శ్రీశైలం మల్లన్నను కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం హైదరాబాద్ కు చేరుకున్న ఆయన.. అక్కడి బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్ లో సున్నిపెంటకు చేరుకున్నారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, ఎంపీ బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి, కలెక్టర్, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. రోడ్డు మార్గంలో శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జునుడి దర్శనార్థం ఆలయానికి వెళ్లారు. ఆలయం వద్ద పోలీసులు పటిష్ఠ భద్రతను ఏర్పాటు చేశారు. దర్శనానంతరం ఆయన భ్రమరాంభ అతిథి గృహానికి చేరుకుని అక్కడే భోజనం చేశారు. తిరిగి హైదరాబాద్ కు వెళ్లి అక్కడి నుంచి 3.50 గంటలకు ఢిల్లీకి బయల్దేరారు.





