245
రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్య నాయుడు తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. మంగళవారం రాజ్యసభలో కొందరు సభ్యులు అనుచితంగా ప్రవర్తించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు ఎంపీలు బల్లలపై కూర్చోవడం, మరికొందరు వాటిపై ఎక్కడం వల్ల సభ పవిత్రత దెబ్బతిందని గద్గద స్వరంతో వ్యాఖ్యానించారు.మంగళవారం సభలో జరిగిన ఘటనలపై వెంకయ్య ఆందోళన వ్యక్తం చేస్తున్న సమయంలోనూ కొందరు సభ్యులు తమ నిరసనలు కొనసాగించారు. గట్టిగా నినాదాలు చేస్తూ మరోమారు గందరగోళం సృష్టించారు. ఫలితంగా రాజ్యసభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేశారు వెంకయ్య.