
గుట్కా మాఫియా ఓ జర్నలిస్టును కిరాకతంగా హత్య చేసింది. అక్రమ కార్యకలాపాలను ప్రసారం చేయించడంతో కర్నూలు జిల్లా నంద్యాలలో జర్నలిస్ట్ హత్యకు గురయ్యాడు. కత్తులతో దాడి చేసి జర్నలిస్ట్ కేశవను దుండగులు హత్య చేశారు. కేశవ ఓ యూట్యూబ్ ఛానల్‌లో రిపోర్టర్‌గా పనిచేస్తున్నాడు. అతడి కథనాల కారణంగా ఇటీవల సస్పెండ్ అయిన కానిస్టేబుల్ హత్య చేయించాడని కేశవ కుటుంబ సభ్యులు, స్నేహితులు ఆరోపిస్తున్నారు. కర్నూలు జిల్లాలో జర్నలిస్టుగా ఓ యూట్యూబ్ ఛానల్‌లో కేశవ పని చేస్తున్నాడు. నంద్యాలకు చెందిన కానిస్టేబుల్ సుబ్బయ్య దురాగతాలపై తన యూట్యూబ్ ఛానల్ లో వార్త ప్రసారం చేశాడు. నంద్యాల టూ టౌన్లో కానిస్టేబుల్ గా పనిచేస్తున్న సుబ్బయ్యకు సంబంధించిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీని ఆధారంగానే తనను ఇటీవల ఎస్పి సస్పెండ్ చేయడంతో కేశవపై కానిస్టేబుల్ సుబ్బయ్య కక్ష కట్టాడు. ఎస్పీ సస్పెండ్ చేయడానికి కారణం… కేశవ అందించిన కథనాలేనన్న కక్షతో కేశవను హత్య చేయించారని కేశవ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
హత్య జరిగిన రోజు కేశవ తోటి రిపోర్టర్ ప్రతాప్ తో కలిసి ఎన్జీవోస్ కాలనీకి వెళ్లాడు. అక్కడ కేశవతో ప్రత్యేకంగా మాట్లాడాలని సుబ్బయ్య, అతడి తమ్ముడు నాని గదిలోకి తీసుకెళ్లారు. కొద్ది నిమిషాలకే ఆ గదిలోంచి గట్టిగా కేకలు వినిపించటంతో ప్రతాప్ వెళ్లాడు. అక్కడ తీవ్రగాయాలతో ఉన్న కేశవను ఆటోలో నంద్యాల ప్రభుత్వాస్పత్రికి చికిత్స నిమిత్తం తరలించాడు. అప్పటికే కేశవ మృతిచెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పదునైన ఆయుధంతో కేశవ వీపు వెనుకభాగంలో తీవ్రంగా పొడిచినట్లు వైద్యులు తెలిపారు.





