
640views
జమ్మూకశ్మీర్లోని రాజౌరిలో శుక్రవారం భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. ఇందులో ఇద్దరు ఉగ్రవాదులు హతమయ్యారు. సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు స్థానిక పోలీసులు తెలిపారు. రాజౌరీలోని థనామండి అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు దాక్కున్నారన్న సమాచారంతో పోలీసులు, భద్రతా బలగాలు సంయుక్త ఆపరేషన్ నిర్వహించాయి. తనిఖీలు నిర్వహిస్తుండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. అనంతరం పోలీసు ఎన్‌కౌంటర్‌లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైనట్లు వెల్లడించారు. గత కొంతకాలంగా కశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకాలాపాలను అరికట్టేందుకు బలగాలు శ్రమిస్తున్నాయి. రాష్ట్రంలోన భారీగా తనిఖీలు చేపడుతున్నాయి.



