పశ్చిమ బెంగాల్ : ఫిర్యాదును ఉపసంహరించుకోండి, టిఎంసిలో చేరండి : ఎన్నికల అనంతర హింసకు గురైన అత్యాచార బాధితులకు పోలీసులు, టిఎంసీ కార్యకర్తల బెదిరింపు

పశ్చిమ బెంగాల్‌లో ఎన్నికల తర్వాత జరిగిన హింసకు గురైన అత్యాచార బాధితురాలు తనను, తన కుటుంబాన్ని కాపాడాలని NHRC కి లేఖ వ్రాసింది. పోలీసులు, టిఎంసి నాయకులు తమను ఫిర్యాదు ఉపసంహరించుకుని టిఎంసిలో చేరమని బెదిరిస్తున్నారని ఆమె ఆ లేఖలో పేర్కొన్నారు.
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించిన రోజు మే 2 న బాధితురాలు సామూహిక అత్యాచారానికి గురయ్యారు.
రాష్ట్రంలో ఎన్నికల అనంతర హింస కేసులపై దర్యాప్తు చేపట్టాలంటూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు రాష్ట్రానికి విచ్చేసిన NHRC బృందం పశ్చిమ బెంగాల్‌లో ఉన్నప్పుడు జూన్ 21 న ఆమె NHRC కి ఆమె ఫిర్యాదు చేసింది.
బుధవారం (జూలై 28) NHRC చైర్ పర్సన్ కు ఆమె వ్రాసిన లేఖలో, “జూలై 23 వరకూ NHRC కి నా ఫిర్యాదును దాఖలు చేసే మధ్య కాలంలో, నా ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని, పార్టీ మారమని పోలీసులు, స్థానిక టిఎంసి నాయకులు నన్ను ఒత్తిడి చేస్తున్నారు.” అని ఆమె పేర్కొన్నారు. జూలై 23 రాత్రి పోలీసు అధికారులు తనను బెదిరించడానికి తన ఇంటిపై ఎలా దాడి చేశారో కూడా ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
మళ్ళీ బుధవారం (జూలై 28), స్థానిక టిఎంసి కార్యకర్తలు ఆమెను బలవంతంగా స్థానిక టిఎంసి నాయకుడి ఇంటికి తీసుకెళ్లారు, అక్కడ ఆమె ఆదేశాలకు కట్టుబడి ఉండకపోతే భయంకరమైన పరిణామాలు ఉంటాయని బెదిరించారు.
“జూలై 26 మరియు 27 తేదీలలో టిఎంసి నాయకులు నా కుటుంబం మరియు బంధువులను సంప్రదించి, నా స్టేట్మెంట్ మరియు ఫిర్యాదును నేను ఉపసంహరించుకోకపోతే తనను, తన బంధువులను చంపేస్తామని బెదిరించడం ప్రారంభించారు” అని ఆమె NHRC చైర్‌పర్సన్‌కు వ్రాసిన లేఖలో పేర్కొంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల అనంతర హింస కేసులను కలకత్తా హైకోర్టు ధర్మాసనం ప్రస్తుతం విచారిస్తోంది.
Source : Organiser





