ArticlesNews

తమిళనాడులో ఆక్రమణలకు గురవుతున్న ఆలయ భూములు

240views

మిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో ఇటీవల జరిగిన కొన్ని సంఘటనలు హిందువులకు ఆగ్రహం తెప్పించాయి. కొందరు ముస్లింలు అక్కడి ఆలయంలోని శివలింగాన్ని త్రిశూలంతో తొలగించడానికి ప్రయత్నించడం, ఆత్రి కొండలను ఆక్రమించడం హిందువుల కోపానికి కారణమయ్యాయి.

హిందూ దేవాలయాలకు చెందిన భూములను ఆక్రమించుకోవడంలో, తమ అధికార బలంతో దేవాలయాల ప్రాంగణాలలోని దుకాణాలను పొందడంలో తమిళనాడు మైనారిటీ ముస్లిములకు రాజకీయ నాయకులు బహు చక్కగా తోడ్పడుతున్నారు. దీనిపై హిందూ సంఘాలు మరియు భక్తులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై కొందరు కోర్టుకు కూడా వెళ్ళారు.

“హిందూ దేవాలయ భూములను ఇతర అవసరాలకు వినియోగించకూడదని దేవాదాయ ధర్మాదాయ శాఖ నిబంధనల్లో స్పష్టంగా స్పష్టంగా పేర్కొనబడి ఉన్నదని కోర్టులు స్పష్టం చేస్తున్నాయి. భక్తులు ఇచ్చిన కానుకలకు దేవుడే శాశ్వత యజమానని హైకోర్టు స్పష్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం దేవాలయ ఆస్తులు, విగ్రహాలు మరియు భూములకు సంరక్షకులుగా మాత్రమే వ్యవహరించాలని, ప్రజా ప్రయోజనాల పేరుతో వాటిని విక్రయించడానికి గానీ, అద్దెకు ఇవ్వడానికి గానీ, ఎలాంటి హక్కులూ లేవని నిబంధనలు స్పష్టం చేస్తున్నాయి. కానీ ఆ నిబంధనలను పాటించడం లేదు. తమిళనాడు హెచ్ ఆర్ & సిఇ మంత్రి శేఖర్ బాబు నిబంధనలకు విరుద్ధంగా పలు పథకాలను రూపొందిస్తున్నారు. దేవాలయాలకు విరాళంగా వచ్చిన పాత ఆభరణాలను బంగారు కడ్డీలుగా మార్చి, ఆదాయ ఉత్పత్తిలో భాగంగా బ్యాంకుల్లో జమ చేయాలన్న ఆలోచనను ఆయన ఇటీవల వెలిబుచ్చారు. అయితే ఈ ఆలోచనను ఎవరూ సమర్థించలేదు. తాను కోట్లాది రూపాయల విలువైన దేవాలయ భూములను వాటి ఆక్రమణదారుల నుంచి తిరిగి రాబడుతున్నానని మంత్రి తన పర్యటనలలో ఘనంగా ప్రకటనలు గుప్పిస్తున్నప్పటికీ అందుకు తగ్గ ఆధారాలు మాత్రం ఇప్పటివరకూ ఏమీ లేవు. దీనిపై ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో దేవాలయాల పరిపాలనను భక్తులకే వదిలివేయాలన్న డిమాండ్ తమిళనాడులో రోజురోజుకీ ఊపందుకుంటోంది.

అలాగే తిరునెల్వేలి జిల్లాలో, అల్వార్కురిచిలోని అత్రి కొండలను ఆక్రమించడానికి కొన్ని ఇస్లామిక్ సంస్థలు ప్రయత్నించిన సంఘటన కూడా ఇటీవల తెరపైకి వచ్చింది. అనుసూయా దేవి సమేత అత్రి పరమేశ్వర ఆలయం మరియు ఆత్రి కొండలలోని సిద్ధార్ కొరక్కర్ పీతం HR మరియు CE శాఖచే నిర్వహించబడుతుంది. అత్రి గంగా నది (తీర్థం) లాంటిది. ఇది జీవ నది. ఆ నదిలో అరుదైన తెల్ల తాబేళ్ళు ఉంటాయి. వేసవిలో కూడా ఈ నది ఎండిపోదు.

వేసవి నెలల్లో, కడనా నది నుండి కూడా అత్రి నదిలోనికి నీరు ప్రవహిస్తాయి. ఇది జీవనది. ఇస్లామిక్ సంస్థలు ప్రస్తుతం ఈ ఆధ్యాత్మిక కొండలను ఆక్రమించుకుంటున్నాయన్న విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. అటవీ శాఖ అనుమతితో ఆలయాన్ని సందర్శించిన ప్రజలు, అక్కడ ఆకుపచ్చ రంగులో ఉన్న ఇస్లామిక్ చిహ్నాల (నెలవంక మరియు 786) స్కెచ్‌లు చూసి షాక్ అయ్యారు. అమరులైన సాధువులెందరో ఈ కొండపై కొలువై ఉన్నారని భక్తుల విశ్వాసం.

అలాగే తిరునెల్వేలి పట్టణానికి సమీపంలో చోక్కట్టన్ తోప్పు వద్ద గల ప్రఖ్యాత నెల్లయ్యప్పర్ ఆలయ కాలువకు చెందిన భూమిలో ఉన్న దేవాలయ గర్భగుడిలోని పవిత్ర శివలింగాన్ని కొందరు ముస్లింలు త్రిశూలంతో పెకలించడానికి ప్రయత్నించారు. ఇది విన్న హిందూ మున్నాని మేలపాలయం కార్యదర్శి సుడలై, మండల చీఫ్ శంకర్, మణి తదితరులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిజానికి ఆలయ EO రామరాజ్ సుద్దమల్లి ముస్లిం యువకులు మూలవిరాట్ ను తొలగించడానికి చేస్తున్న ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అలాగే ఆ గ్రామస్తులు కూడా సంఘటితంగా నిలిచి వారి ప్రయత్నాన్ని విజయవంతంగా అడ్డుకోగలిగారు.

మరో హిందూ మున్నాని కార్యకర్త ఎర్. అరుము కని, శ్మశానవాటికలో ఉంచిన నేమ్ బోర్డు నుండి ‘హిందూ’ పదాన్ని తొలగించడంపై తాము పోరాడామని తెలిపారు. హిందూ శ్మశానవాటిక నుండి హిందూ అనే పదాన్ని డిఎంకె ప్రభుత్వం తొలగించింది. హిందూ సంస్థల నిరసనల తరువాత ఆ బోర్డుపై తిరిగి హిందూ పదం చేర్చడం జరిగింది. ఈ సంఘటన జరిగిన అనంతరం తమిళనాడు ఎండోమెంట్స్ శాఖవారు తమ ప్రకటనలలో “హిందూమత (Hindu religious)” అనే పదం వాడకుండా “Charitable and endowment” అని మాత్రమే వాడడం మొదలు పెట్టారు. ఉద్దేశ్యపూర్వకంగానే దేవాదాయ శాఖ అధికారులు హిందూ అనే పదాన్ని మరుగు పరచారు. “కన్యాకుమారిలోని HR& CE సూపరింటెండెంట్ కార్యాలయం ముందు ఉన్న నేమ్ బోర్డే అందుకు సాక్షి” అని హిందూ ముణ్ణని నాయకులు పేర్కొంటున్నారు. మెజారిటీ హిందూ సమాజాన్ని పలుచన చేసి జైనులు, బౌద్ధులు, సిక్కులు, క్రైస్తవులను నెమ్మదిగా చేర్చడానికి ఇది ఒక ప్రయత్నం అని హిందూ మున్నాని వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అన్ని శాఖలలోనూ, అన్ని ప్రభుత్వ కార్యాలయాలలోనూ పాతుకుపోయి ఉన్న క్రైస్తవ అధికారులే ఇలా కుట్రలకు పాల్పడుతున్నారని హిందూ ముణ్ణని ఆరోపిస్తున్నది. అలాంటి అధికారులకు ప్రభుత్వ సహకారం కూడా ఉన్నదని హిందూ మున్నాని పేర్కొంది.

మధురై తిరుపారంకుంద్రంలో, వారు కొండ పైన ఒక మసీదును నిర్మించుకున్నారు. ఎప్పటి నుంచో ప్రతి కార్తీకమాసంలోనూ ఆ కొండపైకి కార్తీకదీపం వెలిగించటానికి వచ్చే హిందువులను అడ్డుకుంటున్నారు. అలాగే దిండిగల్ లోని మరొక కొండను ఆక్రమించిన ముస్లింలు అక్కడి హిందూ దేవతా విగ్రహాలను విసిరి కొట్టారు. పుదుకోట్టై జిల్లాలో, చోళ కాలం నాటి ఆలయంలోని విగ్రహాలన్నీ ఇటీవల శిరచ్ఛేదం చేయబడ్డాయి. అదే సమయంలో, రాణిపేట జిల్లాలో, అమ్మాన్ విగ్రహాలు ధ్వంసం చేయబడ్డాయి. చారిత్రాత్మక పంచలింగేశ్వర్ ఆలయంలోని దేవతలపై వీర్యం స్ఖలనం చేయబడింది. ఇవి మచ్చుకు కొన్ని మాత్రమే. ఈ ద్రవిడ పార్టీ పాలనలో ధ్వంసమైన, అవుతున్న దేవాలయాల జాబితా చాలా పెద్దది.

తమిళనాడులోని కొండలు మరియు ఇతర ప్రదేశాలలో ఉన్న చారిత్రక దేవాలయాల పరిరక్షణకు ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవాలని, నేరస్తులపై కఠినంగా వ్యవహరించాలని భక్తులు మరియు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Source : Organiser.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.