News

ఫ్రాన్స్ నుంచి మరో మూడు రఫెల్ విమానాలు

409views

ఫ్రాన్స్‌ నుంచి మరో మూడు రఫేల్‌ యుద్ధ విమానాలు బుధవారం సాయంత్రం భారత్‌ చేరుకున్నాయి. ఫ్రాన్స్‌ వైమానిక కేంద్రం నుంచి సుమారు 7 వేల కిలోమీటర్లు ప్రయాణించి భారత్‌లో దిగినట్లు భారత వాయుసేన (ఐఏఎఫ్‌) వెల్లడించింది. మార్గమధ్యంలో యూఏఈ వైమానిక దళ ట్యాంకర్లు వీటిలో ఇంధనాన్ని నింపినట్లు పేర్కొంది. ఈ యుద్ధ విమానాల చేరికతో గగనతలంపై భారత వాయుసేన పోరాట సామర్థ్యం మరింత పెరగనున్నట్లు ఐఏఎఫ్‌ తెలిపింది. రఫేల్‌ శ్రేణిలో తొలి అయిదు యుద్ధ విమానాలు గతేడాది జులై 29న భారత్‌కు చేరుకున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి మొత్తం 36 రఫేల్‌ విమానాలు భారత్‌కు అందాల్సి ఉంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.