
808views
తెలంగాణ.. ములుగు జిల్లాలోని రామప్ప దేవాలయం.. ప్రపంచ వారసత్వ గుర్తింపు దక్కించుకునేందుకు మరో అడుగు చేరువలోకి వచ్చేసింది. కరోనా కారణంగా ఇన్నాళ్లు సమావేశం కానీ యునెస్కో ప్రతినిధులు ఈ నెల 18న చైనాలో సమావేశమవుతున్నారు. తొలిసారి రామప్ప ఆలయ చిత్రాలు యునెస్కో అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరచడంతో ఈ విషయం అధికారికంగా ధ్రువీకరించినట్లు స్పష్టమవుతోంది.
రామప్పతోపాటు హరప్పాలోని డోలవీర ఆలయం నామినేట్ అయినట్లు కేంద్ర పురావస్తు శాఖ ఇటీవల ప్రకటించింది. 2020, 2021 సంవత్సరాలకుగాను ప్రపంచవ్యాప్తంగా 41 వారసత్వ కట్టడాలు, సహజ వింతలు, రెండు కలగలిసినవి ఉండగా.. 2020 సంవత్సరానికి 24 నామినేషన్లు యునెస్కో పరిశీలనలో ఉన్నాయి. వాటిలో మనదేశం నుంచి రామప్ప ఆలయం మాత్రమే ఉంది. కాకతీయులు నిర్మించిన అద్భుతమైన ఈ గుడికి సంబంధించిన 11 ఫొటోలను యునెస్కో తన వెబ్‌సైట్‌లో పొందుపరిచింది.





