News

మోడీని అవమానించారనే కేసులో న్యాయస్థానం ముందు రాహుల్ హాజరు..

637views

మోడీ ఇంటి పేరున్న వారందరినీ అవమానించారని… వారి పరువుకు నష్టం కలిగించారనే కేసులో కాంగ్రెస్‌ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ ఈ రోజు సూరత్ కోర్టులో విచారణకు హాజరుకానున్నారు. ఈ మేరకు కాంగ్రెస్‌ గుజరాత్‌ అధ్యక్షుడు అమిత్‌ చావ్డా వివరాలు వెల్లడించారు. కేవలం కోర్టుకు మాత్రమే హాజరయ్యేందుకే రాహుల్ గాంధీ సూరత్ వస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లోనూ రాహుల్ పాల్గొనబోరని స్పష్టచేశారు. ఉదయం 10 గంటలకు రాహుల్ గాంధీ సూరత్ చేరుకుని… మధ్యాహ్నానికి తిరుగు ప్రయాణం అవుతారన్నారు.

2019, ఏప్రిల్‌ 13న కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా కోలార్‌లో నిర్వహించిన ర్యాలీలో రాహుల్‌ గాంధీ పాల్గొన్నారు. ఆ సమయంలో ‘మోడీ’ ఇంటి పేరును ప్రస్తావిస్తూ పలు వ్యాఖ్యలు చేశారు. దొంగలందరీకి ‘మోడీ’ ఇంటి పేరే ఉంటుందంటూ ఆయన విమర్శించారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ నేత, సూరత్‌ ఎమ్మెల్యే పూర్ణేశ్‌ మోడీ అభ్యంతరం వ్యక్తం చేశారు. రాహుల్‌ తన మాటలతో మోడీ అనే ఇంటి పేరున్న వారందరి ప్రతిష్ఠకు భంగం కలిగించారంటూ కోర్టులో పరువునష్టం దావా వేశారు.

ఈ కేసు విచారణ నిమిత్తం రాహుల్ గాంధీ 2019, అక్టోబరులోనూ కోర్టు ఎదుట హాజరయ్యారు. తన వ్యాఖ్యల్లో తప్పేమీ లేదని ఆ సమయంలో ఆయన కోర్టుకు వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.