News

ప్రఖ్యాత న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్ద మూడు వేల మందితో యోగా

467views

అంతర్జాతీయ యోగా దినోత్సవం నేపథ్యంలో న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ వద్ద యోగా దినోత్సవం లో లమ 3 వేలమందికి పైగా ప్రజలు పాల్గొన్నారు. రోజంతా జరిగిన ఈ కార్యక్రమాన్ని సోల్స్ టైస్ టు టైమ్స్ స్క్యేర్ గా అభివర్ణించారు. తమ తమ యోగా మ్యాట్స్ తెచ్చుకుని వీరంతా ఇందులో పార్టిసిపేట్ చేయడం అభినందనీయమని భారత కాన్సులేట్ జనరల్ రణధీర్ జైస్వాల్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమం ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యిందని, ఇండియాలో పుట్టిన యోగా గ్లోబల్ హెరిటేజ్ గా మారిందని ఆయన అన్నారు. ఇది ఆరోగ్యానికి, సంక్షేమానికి..ప్రకృతితో మమేకమై జీవించడానికి తోడ్పడుతుందన్నారు. శాంతియుత సమాజం కోసం, పచ్చని భూతలం కోసం ఇది దోహదపడుతుందని, మానవాళి ఆరోగ్యం దీనిపై ఆధారపడి ఉందని ఆయన చెప్పారు. యోగా ఈజ్ వే ఆఫ్ లైఫ్ అన్నారు. శరీరానికి, మనసుకు సాంత్వన కలిగించే యోగాను అందరూ పాటించాలని జైస్వాల్ సూచించారు.

ప్రాణాయామం, మెడిటేషన్ చేస్తున్న వేలమంది ఈ పరిసరాలను ‘పునీతం’ చేశారని..అద్భుత అనుభవం పొందారని ఈ ఈవెంట్ లో పాల్గొన్న రుచికా లాల్ వ్యాఖ్యానించారు. ఈ సంవత్సరపు గ్లోబల్ థీమ్ ని పురస్కరించుకుని ఐక్యరాజ్యసమితి ప్రవచించిన యోగా ఫర్ వెల్ నెస్ నినాదం నేపథ్యంలో…ట్రైబ్స్ ఇండియాతో బాటు పలు భారతీయ కంపెనీలు ఏర్పాటు చేసిన ఆయుర్వేద, ప్రకృతి సహజ సిద్ధమైన వస్తువులు, ఉత్పత్తుల స్టాల్స్ ను అనేకమంది సందర్శించారు. ఉదయం ఏడున్నర గంటల నుంచి రాత్రి ఎనిమిదిన్నర గంటల వరకు ఇక్కడ 9 యోగా సెషన్స్ నిర్వహించారు. అలాగే న్యూజెర్సీ లోని స్టాట్యూ ఆఫ్ లిబర్టీ వద్ద అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు.ప్రముఖ యోగా నిపుణులు ధారా నటాలీతో బాటు వివిధ భారతీయ సంఘాలు దీన్ని నిర్వహించడం విశేషం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.