
711views
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు (ఏప్రిల్- జూన్ 15) నికరంగా రూ.1,85,871 కోట్ల మేర ప్రత్యక్ష పన్నులు వసూలయ్యాయి. 2020-21 ఇదే సమయంలో నమోదైన రూ.92,762 కోట్లతో పోలిస్తే.. వసూళ్లు ఈసారి రెట్టింపుకావడం గమనార్హం. అయితే గతేడాది ఇదే సమయంలో దేశవ్యాప్త లాక్‌డౌన్ పరిణామాలు వల్ల అప్పుడు ప్రత్యక్ష పన్నుల వసూళ్లు తక్కువగా నమోదైన విషయాన్ని ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి. ఈ ఏడాది ఏప్రిల్- జూన్ 15 వరకు మొత్తం ప్రత్యక్ష పన్నుల్లో కార్పొరేట్ ఆదాయపు పన్ను వసూళ్లు రూ.74,356 కోట్లు కాగా.. వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు రూ.92,762 కోట్లుగా నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు రూ.30,731 కోట్లను రిఫండ్‌లుగా ఇచ్చామని సీబీడీటీ తెలిపింది.





