News

మరింత మెరుగ్గా తీర రక్షణ – నావికా దళంలో చేరిన అధునాతన స్వదేశీ హెలికాప్టర్లు

675views

స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందిన మూడు అధునాతన తేలికపాటి హెలికాప్టర్లు (ఏఎల్‌హెచ్‌ మార్క్‌-3) శనివారం తీరరక్షక దళంలో చేరాయి. కొవిడ్‌ ఆంక్షల నేపథ్యంలో వర్చువల్‌గా రక్షణశాఖ కార్యదర్శి అజయ్‌ కుమార్‌ వీటిని ప్రవేశపెట్టారు. నిఘా, గాలింపు, సహాయ చర్యలకు ఇవి సాయపడతాయని తెలిపారు. తీర ప్రాంత భద్రతను ఇవి మరింత కట్టుదిట్టం చేస్తాయని చెప్పారు. ప్రభుత్వ ఆధ్వర్యంలోని హిందూస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) ఈ హెలికాప్టర్లను అభివృద్ధి చేసింది. వచ్చే ఏడాది మధ్య నాటికి మొత్తం 16 లోహవిహంగాలను తీర రక్షణ దళానికి సరఫరా చేస్తామని ఆ సంస్థ తెలిపింది. సముద్రంలో ఆపదలో చిక్కుకున్న మత్స్యకారులను రక్షించడానికి ఇవి ఉపయోగపడతాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.