News

గబ్బిలాల్లో మరో ప్రమాదకర వైరస్ ను గుర్తించామంటున్న చైనా శాస్త్రవేత్తలు : ప్రపంచం దృష్టిని మరల్చడానికి చైనా నాటకాలాడుతోందంటున్న పలు దేశాలు

626views

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టుకపై పరిశోధన జరుగుతున్న సమయంలోనే చైనా పరిశోధకుల అధ్యయనంలో మరో ఆందోళనకర అంశం వెలుగు చూసింది. గబ్బిలాల్లో కొత్త రకపు కరోనా వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19 వైరస్‌ను జన్యుపరంగా పోలి ఉన్నట్లు వెల్లడించారు. కొవిడ్ -19 వైరస్‌కు అతిదగ్గరగా ఉన్న రెండో వైరస్‌గా పేర్కొన్నారు. యునాన్ ప్రావిన్స్‌లోని షాన్‌డోంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వీఫింగ్ షి, అతని సహచరుల పరిశోధనలో ఈ విషయం వెలుగుచూసింది.

గబ్బిలాల్లో ఎన్నిరకాల కరోనా వైరస్‌లు ఉన్నాయి, వాటిలో ఎన్నింటికి మనుషులకు విస్తరించే సామర్థ్యం ఉంది అనే అంశంపై వీఫింగ్ షి, అతని సహచరులు అధ్యయనం జరిపారు. మే 2019 నుంచి 2020 నవంబర్ వరకూ వీరి పరిశోధన సాగింది. చిన్న గబ్బిలాలు, అటవీ ప్రాంతంలో ఉండే గబ్బిళాల నుంచి నమూనాలను సేకరించి పరిశీలించారు. గబ్బిలాల మూత్రం,మలంతోపాటు నోటిలో నుంచి నమూనాలు సేకరించి పరిశోధనలు జరిపారు.

ఇదిలా ఉంటే కరోనా వైరస్ ల్యాబ్ నుండి పుట్టలేదని నిరూపించడానికే చైనా ఇలాంటి పరిశోధనలను ప్రచారం చేస్తోందని అమెరికా సహా పలు దేశాలు విమర్శిస్తున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.