News

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసు కీలక నిందితుడిని అరెస్టు చేసిన ఎన్ఐఏ

497views

కేరళ గోల్డ్ స్మగ్లింగ్ కేసులో కీలక నిందితుడు మహమ్మద్ మన్సూర్ ను తాము అదుపులోకి తీసుకున్నట్లుగా ఎన్ఐఏ కేరళలోని రాయబార కార్యాలయానికి చెందిన ఒక ఉన్నత అధికారికి తెలిపింది. అతను విదేశీ రవాణా మార్గంలో పెద్ద మొత్తంలో బంగారాన్ని స్వాధీనం చేసుకున్నట్లుగా తమకు సమాచారం ఉందని ఎన్ఐఏ వివరించింది.

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని దుబాయ్ నుంచి కాలికట్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వచ్చిన మన్సూర్‌ను ఎన్‌ఐఏ అరెస్టు చేసిందని దర్యాప్తు సంస్థ అధికారులు తెలిపారు.

ఎర్నాకుళం ఎన్‌ఐఏ కోర్టు మన్సూర్‌పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. కొచ్చిలోని ప్రత్యేక కోర్టులో హాజరుపరిచిన అతన్ని ఐదు రోజుల పాటు ఏజెన్సీ కస్టడీలో ఉంచారు.

గతేడాది జూలై 5 న, త్రివేండ్రం అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఎయిర్ కార్గోలో కొచ్చిన్, కస్టమ్స్ (ప్రివెంటివ్) కమిషనరేట్, అధికారులు 30 కిలోల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు.

ఈ అంశంపై ఎన్‌ఐఏ 2020 జూలై 10 న కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ ఏడాది జనవరిలో 20 మంది నిందితులపై పెట్టిన కేసులో ఇప్పటికే చార్జిషీట్ దాఖలు చేసినట్లు అధికారులు తెలిపారు.

ఈ కేసులో కొనసాగుతున్న దర్యాప్తులో, మొహమ్మద్ మన్సూర్ యుఎఇలో ఉన్నప్పుడు, భారతదేశానికి బంగారం అక్రమ రవాణాకు దోహదపడటానికి ఇప్పటికే చార్జ్ షీట్ దాఖలై ఉన్న నిందితుడు మహ్మద్ షఫీ పి మరియు ఇతరులతో కలిసి కుట్ర పన్నాడని, తిరువనంతపురంలోని యుఎఇ కాన్సులేట్ దౌత్యవేత్తలకు ఎన్ ఐ ఏ వెల్లడించింది. ఈ కేసులో తదుపరి దర్యాప్తు పురోగతిలో ఉందని కూడా ఎన్ ఐ ఏ వివరించింది.

Source : VSK Bharath

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.