769
కాశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయం చేసి లబ్ధి పొందాలనుకునే పాకిస్తాన్ కు మరోసారి చుక్కెదురైంది. జమ్మూ కాశ్మీర్ అంశంతో పాటు.. భారత్ , పాక్ మధ్య ఉన్న ఇతర సమస్యలను చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని సౌదీ అరేబియా… పాకిస్తాన్ కు సూచించింది. సౌదీ యువరాజు మొహమ్మద్ బీన్ సల్మాన్తో పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జరిపిన చర్చల్లో కాశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినట్లు ఇరుదేశాలు విడుదల చేసిన సంయుక్త ప్రకటనలో వెల్లడించాయి. 2003లో భారత్ -పాక్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని సజావుగా కొనసాగించాలని సౌదీ పాక్ కు హితవు పలికింది. శాంతి, స్థిరత్వం కోసం ఇరుదేశాలూ చర్చలు జరపాల్సిన అవసరముందని సౌదీ అరేబియా అభిప్రాయపడింది.