News

భారత్ అడుగుజాడలలో అమెరికా

476views

దేశంలో 5జీ ట్రయల్స్‌లో చైనా సాంకేతికతను వాడకూడదని భారత్‌ నిర్ణయించింది. దీని పై అగ్రరాజ్యం అమెరికా స్పందించింది. 5జీ ట్రయల్స్‌లో చైనాకు చెందిన హువాయ్‌, జీటీఈ సాంకేతికతను వాడవద్దని నిర్ణయించడం భారత ప్రజలతో పాటు ప్రపంచానికి శుభవార్త .. చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న అక్కడి టెక్‌ కంపెనీలకు దూరంగా ఉండాలని అమెరికా తన మిత్ర దేశాలకు పిలుపునిచ్చినట్లు పేర్కొంది.

‘ఆ (చైనా) కంపెనీలను నెట్‌వర్క్‌ల నుంచి మినహాయించకపోతే అది తగ్గించలేని ప్రమాదమే అవుతుంది. ఈ ముప్పును భారత్‌ ముందే గుర్తించినందుకు సంతోషంగా ఉంది. చైనా కమ్యూనిస్టు పార్టీ నియంత్రణలో ఉన్న టెక్నాలజీ సంస్థల ముప్పును ఎదుర్కోవడంలో గ్లోబల్‌ లీడర్‌గా భారత్‌ ఎందుకు నిలిచిందో మరోసారి నిరూపితమైంది’ అని విదేశీ వ్యవహారాల కమిటీ చీఫ్‌ రిపబ్లికన్‌ మైఖేల్‌ మెక్‌కాల్‌ పేర్కొన్నారు. భారత్‌ తీసుకున్న నిర్ణయం దేశ ప్రజలతో పాటు యావత్‌ ప్రపంచానికి సంతోషకరమైన వార్త అని అభిప్రాయపడ్డారు. భారత టెలికమ్యూనికేషన్లలో చైనాకు చెందిన హువాయ్‌ సాంకేతికత వాడవద్దని నిర్ణయం తీసుకున్నందుకు అమెరికా చట్టసభ సభ్యుడు మైక్‌ వాల్ట్జ్‌ భారత్‌కు ధన్యవాదాలు తెలిపారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.