News

కరోనా సంక్షోభంలో…రిజర్వు బ్యాంక్ చేయూత

801views

రోనా కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దేందుకు భారత రిజర్వు బ్యాంకు రంగంలోకి దిగింది. టీకా తయారీ సంస్థలు, ఆసుపత్రులు, లేబరేటరీలు, కరోనా సంబంధిత ఆరోగ్య సదుపాయాల కల్పనకు రుణాలు ఇచ్చేందుకు బ్యాంకులను అనుమతిచ్చింది. ఇందుకోసం బ్యాంకులకు రూ. 50 వేల కోట్ల నిధులు ఇవ్వనుంది. కరోనాతో ఆర్థికంగా నలిగిపోయిన వ్యక్తులు, చిన్న.. మధ్యతరహా వ్యాపార సంస్థలు తీసుకున్న రుణాలను తిరిగి చెల్లించేందుకు మరింత గడువు ఇచ్చింది. రాష్ట్రాల ఓవర్డ్రాఫ్ట్ నిబంధనలను సరళతరం చేసింది. ఈ చర్యలు దేశానికి ఎంతో మేలు చేయనున్నాయి.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.