
ఉగాది చైత్ర శుద్ధ పాడ్యమి (ఉగాది) సందర్భంగా దేశవ్యాప్తంగా భూసార సంరక్షణ (భూ సుపోషణ) ఉద్యమం ప్రారంభమైన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా అనేకచోట్ల భూమి పూజతో భూసార సంరక్షణ ఉద్యమం ప్రారంభమైంది.
అన్నిచోట్లా రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్న ఈ కార్యక్రమంలో రసాయన ఎరువులు, పురుగు మందుల కారణంగా తగ్గిపోతున్న భూసారాన్ని సాంప్రదాయక పద్ధతుల ద్వారా సంరక్షించుకోవాల్సిన ఆవశ్యకతను ఈ సందర్భంగా వక్తలు రైతులకు వివరించారు. సేంద్రియ వ్యవసాయ పద్ధతుల ద్వారా భూసారాన్ని సంరక్షించుకోవడంతో పాటుగా పెంచుకోవచ్చునని కూడా ఈ సందర్భంగా వక్తలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రైతులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సేంద్రియ వ్యవసాయాన్ని కొనసాగిస్తున్న కొంతమంది రైతులు తమ అనుభవాలను సహచర రైతులతో పంచుకున్నారు.
భూసార సంరక్షణ ఉద్యమం ప్రారంభ కార్యక్రమాల దృశ్యాలను ఓసారి పరికిద్దాం……..

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో……..

అనంతపురం జిల్లా గుంతకల్లులో……..

కడప జిల్లా పులివెందులలో…
నెల్లూరు జిల్లా దామరమడుగులో…….

ప్రకాశం జిల్లా పర్చూరులో……
గుంటూరు జిల్లా పుల్లడిగుంటలో……
కృష్ణా జిల్లా తాడిగడపలో…….
తూర్పు గోదావరి జిల్లా ప్రత్తిపాడులో……

తూర్పు గోదావరి జిల్లా అంబాజీపేటలో……..

పశ్చిమ గోదావరి జిల్లా నాచుగుంటలో……..
13/ 4/ 2021 చైత్ర శుద్ధ పాడ్యమి నాడు ప్రారంభమైన ఈ ఉద్యమం 24/ 7/ 2021 ఆషాఢ పూర్ణిమ వరకు కొనసాగనున్నది. ఈ ఉద్యమం ద్వారా గ్రామ గ్రామాన రైతులకు భూసార సంరక్షణ ఆవశ్యకతను, పద్ధతులను, సేంద్రియ వ్యవసాయ విధానాలను, ప్రయోజనాన్ని వివరించనున్నారు.









