335
జమ్మూకశ్మీర్లోని షోపియాన్ జిల్లాలో భద్రతా దళాలు, లష్కరే ఉగ్రవాదులకు మధ్య సోమవారం తెల్లవారుజామున భారీగా కాల్పులు జరిగాయి. ఈ ఎన్‌కౌంటర్లో నలుగురు ఉగ్రవాదులు మృతి చెందారు. జిల్లాలోని మనిహాల్ ప్రాంతంలో ఉగ్రవాదులు తలదాచుకున్నట్టు అందిన సమాచారం మేరకు సోమవారం తెల్లవారుజామున 2 గంటలకు భద్రతా దళాలు ఆ ప్రదేశాన్ని తమ అధీనంలోకి తీసుకుని తనిఖీలు చేపట్టారు. భారత ఆర్మీ, సీఆర్పీఎఫ్, జమ్మూకశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టారు. తొలుత భద్రతాదళాలపైకి ముష్కరులు కాల్పులు జరపడంతో మన జవాన్లు దీటుగా జవాబిచ్చారు. కాగా, మృతిచెందిన నలుగురు ఉగ్రవాదులను లష్కరే తోయిబాకు చెందిన వారిగా నిర్ధారించారు. ఆపరేషన్ పూర్తయినట్లు కాళ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ ఓ ప్రకటనలో వెల్లడించారు.
Source: ORGANISER