
ఢిల్లీలోని సారాయ్ కాలే ఖాన్ లోని ఒక దళిత కాలనీపై శనివారం రాత్రి ఒక ముస్లిం ముఠా దాడి చేసింది. ఒక దళిత వ్యక్తి తన ముస్లిం ప్రియురాలిని వివాహం చేసుకున్నాడన్న కారణంతో ముస్లిములు ఆ దళిత కాలనీపై దాడికి దిగారు. దాంతో బాధితుడి కుటుంబం ఘజియాబాద్ లోని వారి బంధువుల దగ్గరకు పారిపోయింది.
రాడ్లు, కర్రలు, కత్తులతో సాయుధులైన 50 మందికి పైగా ముస్లింల గుంపు శనివారం అర్థరాత్రి అకస్మాత్తుగా ఆ ప్రాంతంపై దాడి చేసింది. వారు బయట నిలిపిన వాహనాలను ధ్వంసం చేశారు. ముస్లిం యువతిని వివాహమాడిన దళిత కుటుంబానికి చెందిన వాహనాలు, ఆస్తులనే కాకుండా ఘటనతో సంబంధం లేని ఇతరుల ఆస్తులకు కూడా విధ్వంసకారులు నష్టం కలిగించారు. పోలీసులు వచ్చేంతవరకు షుమారు ఒక గంట సేపు అల్లర్లు యధేచ్చగా కొనసాగాయి. పరిస్థితిని నియంత్రించడానికి ఈ ప్రాంతంలో పారామిలిటరీ ఫోర్సును మోహరించారు.
తన పొరుగున ఉన్న ముస్లిం యువతితో సదరు దళిత యువకుడు ప్రేమలో పడ్డట్టుగా తెలుస్తోంది. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. కానీ ఆ వ్యక్తి వేరే మతానికి చెందినవాడు అనే కారణంతో అమ్మాయి కుటుంబం వివాహానికి ఇష్టపడలేదు. దాంతో, వారు రహస్యంగా వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు సదరు బాలిక పోలీస్ స్టేషన్లో ఒక స్టేట్మెంట్ కూడా నమోదు చేసింది. కేసు రిజిస్టర్ చేసుకున్న పోలీసులు నిందితుల కోసం గాలిస్తున్నారు.
Source : Organiser





