News

ఆర్ ఎస్ ఎస్ సహ సర్ కార్యవాహగా శ్రీ అరుణ్ కుమార్, ప్రచార ప్రముఖ్ గా శ్రీ సునీల్ అంబేకర్

1.1kviews

ఆర్ ఎస్ ఎస్ అఖిల భారతీయ సర్ కార్యవాహగా శ్రీ దత్తాత్రేయ హొసబలే ఎన్నికైన విషయం మనకు తెలిసిందే. కాగా తాజాగా ఇప్పటివరకూ అఖిలభారత ప్రచార ప్రముఖ్ గా వ్యవహరిస్తూ వచ్చిన శ్రీ అరుణ్ కుమార్ గారిని అఖిల భారత సహ సర్ కార్యవాహగా నియమించారు. అలాగే ఇప్పటివరకూ అఖిలభారత సహ ప్రచార ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వహించిన శ్రీ సునీల్ అంబేకర్ ఇకనుంచి అఖిల భారత ప్రచార ప్రముఖ్ గా బాధ్యతలు నిర్వహిస్తారు. ఈ మేరకు అఖిల భారత ప్రతినిధి సభలలో నిర్ణయించినట్లుగా సమాచారం.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.