
552views
తిరుమల వేంకటేశ్వరుడిని ఇస్రో శాస్త్రవేత్తల బృందం దర్శించుకుంది. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఇస్రో ఛైర్మన్ శివన్‌తో పాటు శాస్ర్తవేత్తలు స్వామివారి సేవలో పాల్గొన్నారు. పీఎస్‌ఎల్‌వీ సీ-51 ప్రయోగం నేపథ్యంలో శ్రీవారి ఆశీస్సులు పొందారు. నమూనా ఉపగ్రహాన్ని మూలమూర్తి వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రయోగం విజయవంతం కావాలని పండితులు వేదాశీర్వచనం చేసి.. తీర్థ ప్రసాదాలు అందజేశారు.





