News

భారత్ అమ్ములపొదిలో మరో ఆరువేల అత్యాధునిక తుపాకులు

542views

భారత్ బలగాలకు మరింత మందుగుండు సామగ్రిని అందించడంలో భాగంగా ఇజ్రాయెల్ నుండి 6 వేల నెగెవ్ లైట్ మిషన్ గన్స్ ని భారత్ అందుకున్నది. ప్రస్తుతం అధికారులు వాటికి జబల్పూర్ లో నాణ్యతా పరిక్షలు నిర్వహిస్తున్నారు. ఫాస్ట్ ట్రాక్ ప్రొసీజర్ కింద 880 కోట్ల రూపాయలతో 16,479 లైట్ మిషన్ గన్ (LMG) లను కొనడానికి భారత్ 2020 మార్చి 19 న ఇజ్రాయెల్ వెపన్స్ ఇండస్ట్రీస్ (ఐడబ్ల్యుఐ) తో ఒప్పందం కుదుర్చుకుంది.

చైనా,పాకిస్థాన్‌ సరిహద్దుల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న ఈ పరిస్థితుల్లో, ఫ్రంట్ లైన్ దళాలు చురుకుగా కదలడానికి అనుగుణంగా వారికి మరింత బలం చేకూర్చడానికి ఈ LMG లు ఎంతగానో ఉపయోగపడనున్నాయి.
నెగెవ్ 7.62X51 మి . మీ లైట్ మెషిన్ గన్ అద్భుతమైన పనితీరు కనబరిచే ఆయుధంగా నిరూపితమైనది.ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు దీనిని ఉపయోగిస్తున్నాయి.

సైనికులు ప్రస్తుతం ఉపయోగిస్తున్న ఆయుధాల కన్నా ఈ ‌LMG మరింత శక్తివంతమైనది. ప్రత్యర్థులకు తీవ్రమైన నష్టాన్ని కలిగించగల ఆయుధమిది.

ఈ ఏడాది జనవరి మధ్యలో ముంబైలో భారత సైన్యం ఇజ్రాయిల్ నుంచి మొదటిగా దిగిమతి అయిన 6,000 యూనిట్ల (తుపాకుల)ను అందుకుంది.  ప్రస్తుతం తుపాకులను జబల్పూర్ తరలించి వాటి పనితీరుని తనిఖీ చేస్తున్నారు. మిగిలిన తుపాకులు ఈ ఏడాది మార్చి చివరి నాటికి భారత్ కి అందే  అవకాశం ఉంది.

భారత సైన్యం యొక్క మిగిలిన ఆయుధ అవసరాలను తీర్చడానికి “మేక్ ఇన్ ఇండియా” లో భాగంగా భారత పరిశ్రమలలోనే తుపాకులను తయారు చేయనున్నారు. ఆ పని ప్రస్తుతం ప్రీ-ట్రయల్ దశలో ఉంది.

“ఈ LMG ఆయుధం మన సైనిక దళాలకు అందితే అది మన ఫ్రంట్ లైన్ దళాల విశ్వాసాన్ని పెంచుతుంది. సాయుధ దళాలకు ఎంతో అవసరమైన యుద్ధ శక్తిని అందిస్తుంది” అని రక్షణ మంత్రి రాజనాథ్ సింగ్ అన్నారు.

Source : Samardha News.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.