361
మావోయిస్టు ప్రభావిత, కొండ ప్రాంతాల్లో అత్యవసర పరిస్థితుల్లో వినియోగం కోసం సీఆర్పీఎఫ్ తో కలిసి బైక్ అంబులెన్స్ ను డీఆర్డీవో రూపొందించింది. దాడి లేదా ప్రమాదం జరిగిన సందర్భంలో ఘటన ప్రదేశం నుంచి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించడంలో ఎదురవుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ బైక్ ను రూపొందించినట్లు డీఆర్డీవో తెలిపింది.
సిబ్బంది విధులు నిర్వహిస్తున్న అన్ని ప్రదేశాల్లో ఈ బైక్ లు వినియోగించనున్నట్లు సీఆర్పీఎఫ్ వెల్లడించింది. విధులు నిర్వహించే ప్రదేశాల్లో సాధారణ ప్రజల కోసం కూడా వీటిని ఉపయోగించనున్నట్లు తెలిపింది. గత కొన్ని రోజులుగా పలు చోట్ల ప్రయోగాత్మకంగా వీటిని పరీక్షించారు. సీఆర్పీఎఫ్ సూచనల మేరకు ఈ బైక్ అంబులెన్స్ ను రక్షణ పరిశోధన సంస్థ తయారుచేసింది.