
546views
విజయవాడ నగరంలోని ప్రకాశం బ్యారేజీకి సమీపంలో 9 ఆలయాల పునఃనిర్మాణానికి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ భూమిపూజ నిర్వహించారు. రూ.77 కోట్లతో దుర్గుగుడి అభివృద్ధి, విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. భూమి పూజ అనంతరం కనకదుర్గమ్మను సీఎం దర్శించుకోనున్నారు.
కృష్ణా నది తీరంలో గతంలో ఉన్న 9 ఆలయాలను 2016 పుష్కరాల సమయంలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని తెదేపా ప్రభుత్వం తొలగించింది. ప్రస్తుతం వాటిని తిరిగి అదే స్థానంలో నిర్మించేందుకు ఈ ప్రభుత్వం చర్యలు చేపట్టింది.





