News

ఏపీలో మరో ఘటన : గుడిలో వినాయకుని విగ్రహం మాయం

351views

పీలో దేవాలయాపై జరుగుతున్న దాడులు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇటీవల విజయనగరం జిల్లా రామతీర్థంలో కోదండ రాముడి విగ్రహాన్ని కొందరు ధ్వంసం చేసిన ఘటన మరువక ముందే తాజాగా కడప జిల్లాలో మరో ఘటన చోటుచేసుకుంది. ఇంతకు ముందు ఆలయాల్లో విగ్రహాలను ధ్వంసం చేస్తుండగా ఇప్పుడు ఏకంగా ఆలయంలో విగ్రహాన్నే మాయం చేశారు.

కడప జిల్లా వేముల మండలం చాగరేవు గ్రామంలో వినాయక విగ్రహాన్ని గురువారం రాత్రి దుండగులు అపహరించారు. ఈ విషయాన్ని శుక్రవారం ఉదయం గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. స్థానికలు సమాచారంతో ఎస్ఐ సంజీవరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని ఆలయ పరిసరాలను పరిశీలించారు. ఆ ప్రాంతంలో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.