
476views
ఆఫ్గనిస్థాన్‌లో బాంబు పేలుళ్లు, ఆత్మాహుతి దాడుల పరంపర కొనసాగుతూనే ఉంది. నిన్న ఆదివారం దేశ రాజధాని కాబూల్‌లో ఆత్మాహుతిదాడిగా అనుమానిస్తున్న ఓ కారు బాంబు పేలుడులో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. రాజధాని నగరం పశ్చిమ ప్రాంతంలో ఈ పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. ఈ ఘటనకు బాధ్యత వహిస్తూ ఇప్పటి వరకూ ఏ ఉగ్రవాద సంస్థా ప్రకటించలేదు.





