News

ఆర్. ఎస్. ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీ గోవింద వైద్య అస్తమయం

693views

ఆర్. ఎస్. ఎస్ సీనియర్ కార్యకర్త శ్రీ మాధవ గోవింద వైద్య (97 సం.) ఈ రోజు పరమపదించారు. స్వర్గీయ గోవింద వైద్య ‘తరుణ్ భారత్’ పత్రిక సంపాదకులుగా వ్యవహరించారు. వారు ఆర్. ఎస్. ఎస్ కు ఇప్పటివరకు ఉండిన మొత్తం ఆరుగురు చీఫ్ (సర్ సంఘచాలక్) లతో కలిసి పనిచేశారు. వారు ఆర్. ఎస్. ఎస్ లో అఖిల భారత ప్రచార ప్రముఖ్ గా కూడా బాధ్యత నిర్వహించారు. వారి ఇరువురు కుమారులలో ఒకరు శ్రీ మన్మోహన్ జీ వైద్య ఆర్. ఎస్. ఎస్ సహ సర్ కార్యవాహగా కొనసాగుతున్నారు. మరొకరు శ్రీ శ్రీరాం వైద్య పూర్తి సమయ కార్యకర్త (ప్రచారక్) గా విదేశాలలో ఆర్. ఎస్. ఎస్ కార్యకలాపాల (విశ్వ విభాగ్) విస్తరణ కోసం పని చేస్తున్నారు. 9 దశాబ్దాల సంఘ ప్రస్థానానికి శ్రీ గోవింద వైద్య సాక్షిగా నిలిచారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.