
543views
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి పాక్ మరోసారి రెచ్చిపోయింది. జమ్మూ కశ్మీర్‌లోని ఎల్‌ఓసీ వెంట జరిపిన కాల్పుల్లో ఓ భారత జవాను వీరమరణం పొందాడు. రాజౌరీ జిల్లాలోని నౌషీరా సెక్టార్ వద్ద శుక్రవారం అర్ధరాత్రి పాక్ కాల్పులకు తెగబడింది. ఈ దాడిలో ఓ జవాను మృతిచెందగా మరో జవాను గాయాలపాలయ్యాడు. శుక్రవారం అర్ధరాత్రి ఒంటిగంటకు నౌషీరా సెక్టార్‌లోని లామ్ ప్రాంతంలో పాక్ ఈ దుశ్చర్యకు పాల్పడింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ హవల్దార్ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచినట్లు ఆర్మీ అధికారులు వెల్లడించారు. మరో జవాను చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. కాగా పాక్ దాడికి భారత్ దీటుగా స్పందించినట్లు అధికారులు పేర్కొన్నారు. కొద్ది సమయంపాటు పాక్ సైన్యానికి, భారత జవాన్లకు మధ్య కాల్పులు జరిగినట్లు తెలిపారు.





