News

దేశ రక్షణలో అశువులు బాసిన మరో తెలుగు తేజం

561views

మ్మూ కాశ్మీర్ కుప్వారా జిల్లాలోని మాచిల్ సెక్టార్ వద్ద మన దేశంలోకి అక్రమ చొరబాటుకు యత్నిస్తూ ఉండిన ఉగ్రవాదులను నిలువరించే ప్రయత్నంలో జరిగిన ఎదురుకాల్పుల్లో వీర మరణం పొందిన నలుగురు భారత అమరవీరులలో చిత్తూరు జిల్లాకు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి కూడా ఉన్నారు.

18 మద్రాసు రెజిమెంట్ లో హవాల్దార్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న Ch. ప్రవీణ్ కుమార్ రెడ్డి మన దేశంలోకి అక్రమంగా జొరబడడానికి గుంట నక్కల్లా కాచుక్కూర్చున్న పాక్ ప్రేరిత ఉగ్రమూకలతో నిన్న జరిగిన భీకర పోరులో ఉగ్రవాదుల కాల్పుల్లో వీర మరణం పొందారు.

ఈ క్రమంలోనే తెలంగాణకు చెందిన జవాన్ ర్యాడా మహేశ్, కెప్టన్ అశుతోష్ కుమార్, BSF కానిస్టేబుల్ సుదీప్ సర్కార్ లు కూడా అశువులు బాసిన సంగతి తెలిసిందే. ప్రవీణ్ కుమార్ రెడ్డి స్వగ్రామం ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా ఐరాల మండలం రెడ్డివారిపల్లె గ్రామం. ప్రవీణ్ మరణవార్తతో అతని కుటుంబం, గ్రామం శోక సంద్రంలో మునిగిపోయాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.