News

మాచిల్ అమర వీరుల్లో తెలుగువాడు

116views

మ్ము కశ్మీర్‌లోని కుప్వారా జిల్లా మాచిల్‌ సెక్టారు వద్ద చొరబాటుదార్లకు, భద్రత బలగాలకు మధ్య నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. వారిలో తెలంగాణ జవాన్ ఒకరు ఉన్నారు.‌ నిజామాబాద్‌ జిల్లా వేల్పూర్‌ మండలం కోమన‌పల్లి గ్రామానికి చెందిన ర్యాడా మహేష్‌ వీరమరణం పొందారు. ఈ విషయాన్ని ఆయన కుటుంబ సభ్యులు కూడా ధ్రువీకరించారు.  మొదట మహేష్ ‌కు తీవ్రగాయాలు అయినట్లు ఆర్మీ అధికారులు కుటుంబీకులకు సమాచారం అందించారు. అనంతరం వీరమరణం పొందినట్లు తెలపడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.