
641views
భారత తొలి కేంద్ర హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ 145వ జయంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ గుజరాత్‌లోని కెవడియాలోని పటేల్ ఐక్యతా విగ్రహం వద్ద శనివారం ఉదయం నివాళులు అర్పించారు. దేశంలో కొవిడ్ మహమ్మారి విజృంభించిన అనంతరం మోదీ మొదటిసారి ఆ రాష్ట్రంలో పర్యటించారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన నిన్న ఆరోగ్య వనాన్ని ప్రారంభించారు. అంతేకాకుండా ఆయన జయంతిని ఐక్యతా దినోత్సవంగా కూడా కేంద్రం నిర్వహిస్తోంది. నివాళులు అర్పించిన అనంతరం ప్రధాని మాట్లాడుతూ..దేశ ఐక్యత, భద్రతను బలోపేతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కెవడియా సబర్మతి సీప్లేన్ సర్వీస్‌ను ప్రధాని ప్రారంభించనున్నారు.





