News

ధర్మజాగరణ సమితి ఆధ్వర్యంలో ఇంటింటికీ ధర్మజాగరణ

837views

గన్నవరం మండలం కేసరపల్లి మరియు అప్పారావు పేటలలో ఇంటింటికీ ధర్మ జాగరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ధర్మజాగరణ సమితి కార్యకర్తలు ఆయా గ్రామాల్లోని ఎస్ సి కాలనీలలోని ఇంటింటికీ తిరిగి ధార్మిక విషయాలను బోధించారు. వారికి దైనందిన ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగపడే విధంగా ‘నిత్య సాధన’ అనే పుస్తకాన్ని, ధార్మిక చైతన్యం కలిగించే నిమిత్తం ‘ఏది మంచిది? ఏది శ్రేష్టమైనది?’ అనే పుస్తకాన్నీ పంపిణీ చేశారు. ధర్మజాగరణ సమితి కార్యకర్తలు ఈ విధంగా తమ దగ్గరకు వచ్చి ధార్మిక విషయాలను బోధించడాన్ని కాలనీ వాసులు స్వాగతించారు. చక్కటి విషయాలను తెలిపారంటూ హర్షం వ్యక్తం చేశారు. ఇలా తరచుగా వస్తూండమని అభ్యర్థించారు.

ఈ కార్యక్రమంలో ధర్మ జాగరణ విభాగ్ ప్రముఖ్ శ్రీ దోసపాటి భాస్కర్ రావు, పశ్చిమ కృష్ణ టోలీ సభ్యులు సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ధర్మ జాగరణ సమితి గన్నవరం ఖండ ప్రముఖ్  శ్రీ కె. గోపాల స్వామి, ఖండ మహిళా ప్రముఖ్ కావ్య మరియు ఆయా ప్రాంత హిందూ బంధువులు సారథ్యం వహించారు.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.