
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సీనియర్ ప్రచారక్, ఒకప్పటి అఖిల భారతీయ సహ శారీరిక్ ప్రముఖ్ స్వయంసేవకులందరూ ప్రేమగా “బాబన్ రావుజీ” అని పిలుచుకునే శ్రీ రామచంద్ర సహస్రభోజని ఈరోజు నాగపూర్లో తుది శ్వాస విడిచారు. వీరు రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ లో సుదీర్ఘకాలంపాటు వివిధ బాధ్యతలలో పని చేశారు. వయోభారం కారణంగా తమ చివరి రోజులను వీరు నాగపూర్లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయం లోనే గడిపారు.

బాబన్ రావుజీ
అలాగే గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న తమిళనాడుకు చెందిన హిందూ ముణ్ణని సంస్థాపకులు శ్రీ రామ్ గోపాలన్ జీ కూడా ఈరోజు చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

రామ్ గోపాలన్ జీ
రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ శ్రీ మోహన్ భాగవత్, సర్ కార్యవాహ శ్రీ భయ్యాజీ జోషి లు వీరిరువురి నిర్యాణం అత్యంత బాధాకరమని, వారు లేని లోటు పూడ్చలేనిదని, వారిరువురి మరణంతో ఒక మహాధ్యాయం ముగిసిందని పేర్కొంటూ ఒక సంయుక్త ప్రకటన విడుదల చేశారు.





