News

ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు హతం

527views

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులో ఎదురుకాల్పులు జరిగాయి. పోలీసులు-మావోయిస్టుల మధ్య ఈ కాల్పుల ఘటన చోటుచేసుకుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం చెన్నాపురం అటవీ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతిచెందారు. మందుపాతర పేల్చిన గంటల వ్యవధిలోనే ఈ ఎదురుకాల్పులు జరిగాయి. వరుస ఘటనలతో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కొత్తగూడెం ఎస్పీ సునీల్‌దత్‌ ఇప్పటికే ఘటనాస్థలానికి బయల్దేరి వెళ్లారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

మరిన్ని  జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.