
994views
బంగారం అక్రమ రవాణా కేసులో ప్రధాన నిందితురాలుగా ఉన్న స్వప్న సురేష్ పెట్టుకున్న బెయిల్ పిటిషన్‌ను ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తిరస్కరించింది. స్వప్న ఈ నేరానికి పాల్పడిందనడానికి ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ప్రత్యేక కోర్టులో ఎన్‌ఐఏ వాదించింది. ఉద్దేశ్యపూర్వకంగానే రూ.100 కోట్ల విలువైన బంగారం స్మగ్లింగ్‌కు పాల్పడ్డారని కోర్టుకు తెలిపింది. ఎన్‌ఐఏ వాదనలను పరిశీలించిన న్యాయస్థానం, స్వప్న బెయిల్ పిటిషన్‌ను తిరస్కరించింది. స్మగ్లింగ్ ద్వారా వచ్చే డబ్బుని ఉగ్రవాద కార్యకలాపాలకు ఖర్చు చేసే అవకాశం ఉందని ఎన్‌ఐఏ ఇదివరకే కోర్టుకు తెలిపింది. ఈ సమయంలో ఉగ్రవాద వ్యతిరేక, యూఏపీఏ (చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం) నేరాలు కూడా ఈ కేసులో వర్తిస్తాయని ఎన్‌ఐఏ ప్రత్యేక న్యాయస్థానం స్పష్టం చేసింది.





