ArticlesNews

శిలువలను, యేసు చిత్రాలను ధ్వంసం చేయండి, ఆ స్థానంలో మావో, జిన్‌పింగ్ చిత్రాలను ఉంచండి: క్రైస్తవులకు చైనా ప్రభుత్వం ఆదేశాలు

1.3kviews

క్రైస్తవ మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న చిత్రాలను, పోస్టర్‌లను తొలగించి వాటిని మావో జెడాంగ్ మరియు ఇతర కమ్యూనిస్ట్ నాయకుల చిత్రాలతో భర్తీ చేయాలని కోరడం ద్వారా తమ పట్టణంలో క్రైస్తవుల మత స్వేచ్ఛను తొలగించడానికి చైనా అధికారులు ప్రయత్నిస్తున్నారని, షాంకి ప్రావిన్స్‌లోని ఒక పట్టణమైన లిన్‌ఫెన్‌కు చెందిన స్థానిక పాస్టర్ బిట్టర్ వింటర్ పేర్కొంటున్నారు.

మతపరమైన అణచివేతకు కొనసాగింపుగా, చైనా అధికారులు క్రైస్తవులను తమ విశ్వాసాన్ని త్యజించి, శిలువలను, చర్చిలలో యేసు చిత్రాలను తొలగించి ఆ స్థానంలో ఛైర్మన్ మావో ప్రెసిడెంట్ జి జిన్‌పింగ్ చిత్రాలను ఉంచకపోతే వారు ప్రభుత్వ సంక్షేమ ప్రయోజనాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆదేశించారు.

డైలీ మెయిల్‌లో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, దేశంలో మతం యొక్క అభివ్యక్తిని అణిచివేసేందుకు చైనా అధికారులు సమష్టి ప్రయత్నం చేస్తున్నారు. క్రైస్తవ మైనారిటీలపై ప్రభుత్వ అనుమతి పొందిన హింసలో భాగంగా చైనా అధికారులు ఇటీవల అన్హుయి, జియాంగ్సు, హెబీ మరియు జెజియాంగ్‌తో సహా పలు ప్రావిన్సులలోని చర్చిలలో మతపరమైన చిహ్నాలను బలవంతంగా పడగొట్టారు.

చర్చి పైనున్న శిలువను భారీ యంత్రాలతో తొలగిస్తున్న దృశ్యం

స్వతంత్ర అవుట్లెట్ బిట్టర్ వింటర్ ను ఉటంకిస్తూ, డైలీ మెయిల్‌లో ప్రచురించిన కథనం క్రైస్తవులను మతపరమైన చిత్రాలను తీసివేసి, వాటి స్థానంలో కమ్యూనిస్ట్ నాయకుల చిత్రాలను ఉంచాలని షాంకి ప్రావిన్స్ అధికారులు ఆదేశించారని వెల్లడించింది.

చైనా ప్రావిన్స్ లోని హువైనాన్‌లో మతపరమైన వ్యవహారాల అధికారులు గడచిన శని, ఆదివారాలలో స్థానిక శివాన్ క్రైస్ట్ చర్చిలోకి బలవంతంగా ప్రవేశించి దానిలోని శిలువను ధ్వంసం చేశారని ఆరోపించారు. ఒక వారం ముందే చర్చిలోని శిలువను తొలగించమని అధికారులు ఆదేశించినట్లు స్థానిక వనరులను ఉటంకిస్తూ రేడియో ఫ్రీ ఆసియా సమాచారాన్ని వెల్లడించింది.

శిలువను పడగొట్టడానికి చైనా అధికారులు ఆ ప్రదేశానికి వచ్చినప్పుడు, వారు అక్కడే వున్న డజన్ల కొద్దీ విశ్వాసుల నుండి తీవ్ర ప్రతిఘటనను ఎదుర్కొన్నారని, వారు శిలువను పడగొట్టకుండా అధికారులను ఆపడానికి గుమిగూడారని కూడా రేడియో ఫ్రీ ఆసియా పేర్కొంది.

జూలై 7 న జెజియాంగ్ ప్రావిన్స్‌లోని యోంగ్జియాలో కూడా ఇలాంటి సంఘటనలు జరిగాయి. స్థానిక ప్రభుత్వం అయోడి క్రైస్ట్ చర్చి మరియు యిన్‌చాంగ్ క్రైస్ట్ చర్చిపై వున్న శిలువలను పడగొట్టడానికి 100 మంది కార్మికులను పంపినట్లు అమెరికాకు చెందిన చైనా ఎయిడ్ పేర్కొంది. స్థానిక సమాచారం మేరకు ప్రభుత్వ ఉద్యోగులు చర్చిలలోకి బలవంతంగా ప్రవేశించారు. చర్చిల ఆస్తులను ధ్వంసం చేశారు. వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించిన 80 ఏళ్ళ మహిళతో సహా అక్కడ వున్న క్రైస్తవులను కొట్టారు.

గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద క్రైస్తవులు ప్రభుత్వం నుండి సంక్షేమ పథకాల ప్రయోజనాలను పొందడం కొనసాగించాలనుకుంటే వారు తమ మతపరమైన చిహ్నాలను ధ్వంసం చేయాలని, ఆ స్థానంలో కమ్యూనిస్ట్ నాయకుల పోస్టర్లను ప్రదర్శించాలని ప్రభుత్వ అధికారులు బెదిరిస్తున్నారని ఆ నివేదిక పేర్కొంది.

చర్చిలోని మత చిహ్నాలను తొలగించడానికి యంత్రాలతో వస్తున్న అధికారులు

ఈ చర్య చైనా అంతటా మత సంస్థలపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ (CCP) యొక్క భారీ అణచివేత వ్యూహానికి అనుగుణంగా ఉంది. దేశ ప్రధానమంత్రిగా జి జిన్‌పింగ్ రావడంతో, దేశంలో మతపరమైన కార్యకలాపాలను ప్రక్షాళన చేయడానికి CCP చర్యలు దృఢముగా కొనసాగుతున్నాయి. చర్చిలు మరియు మసీదులను కూలగొట్టాలని, టిబెటన్ పిల్లలు బౌద్ధ మత అధ్యయనాలను కొనసాగించకూడదని, అలాగే ఉఘర్ ముస్లిం మైనారిటీలలో ఒక మిలియన్ మందికి పైగా సభ్యులను నిర్బంధ శిబిరాల్లో విద్యాభ్యాసం చేయించటానికి చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఆదేశాలు జారీ చేసింది.

ఈ అణిచివేత చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్ జారీ చేసిన స్పష్టమైన సూచనల ప్రకారమే జరుగుతున్నాయి. అన్ని మతాలు కమ్యూనిస్ట్ పార్టీకి విధేయులుగా ఉండడం తప్పనిసరి. నవంబర్ 2019 లో అన్ని మత గ్రంథాల యొక్క బోధనలను సమీక్షించి, సవరించడానికి కూడా CCP ఒక ఉత్తర్వు జారీ చేసింది. కమ్యూనిస్ట్ పార్టీ నమ్మకాలకు వ్యతిరేకంగా ఉండే కొత్త కంటెంట్ ఏదీ వాటిలో ఉండకూడదని దేశ ఉన్నతాధికారులు ఆదేశించారు. చైనాలోని జాతి మరియు మతపరమైన సమస్యలకు బాధ్యత వహిస్తున్న చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ జాతీయ కమిటీ యొక్క జాతి మరియు మతపరమైన వ్యవహారాల కమిటీ నిర్వహించిన సమావేశంలో ఈ ఉత్తర్వు జారీ చేయబడింది. సమావేశాన్ని పర్యవేక్షించిన చైనా పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ చైర్మన్ వాంగ్ యాంగ్ మాట్లాడుతూ, అధ్యక్షులు జి యొక్క ఆదేశాలకు మతపరమైన అధికారులు కట్టుబడి ఉండాలని మరియు ‘సోషలిజం యొక్క ప్రధాన విలువలు’ మరియు అవసరాలకు అనుగుణంగా వివిధ మతాల సిద్ధాంతాలను వివరించాలని అన్నారు.

SOURCE : OPINDIA

https://www.opindia.com/2020/07/china-jesus-christian-cross-demolish-communist-party-xi-jinping-mao-symbols/

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.