నేటి జాగృత హిందూ సమాజం ముందు మీ జిత్తులేవీ పారవిక
భారతదేశానికి మొట్టమొదటిసారిగా సముద్ర మార్గం కనుగొన్న తర్వాత నుండి హిందూ దేశాన్ని కబళించాలనే కుట్రకు పాశ్చాత్య క్రైస్తవ దేశాలు తెరతీశాయి. పోర్చుగీసు వారు గోవాను తమ అధీనంలోకి తెచ్చుకున్న తర్వాత అక్కడ అంతులేని నరమేధం సృష్టించారు. వేలాది మందిని మత విచారణల...

