ArticlesNews

అసలు ఆ రోజేం జరిగింది? చైనా ఎందుకు వెనకడుగు వేసింది?

1.9kviews

జై భవానీ… అనే ఒకే ఒక్కపిలుపు కోసం భారత నావికాదళం ఎదురుచూసిన క్షణం..

జూలై 4 రాత్రి.. 5 ఉదయాన భారత్ లో ఏం జరిగింది??

సమస్త భారత ప్రజానీకమూ గుండెలమీద చెయ్యి వేసుకొని నిద్రిస్తున్న వేళ. దేశానికి ప్రధాన కాపలాదారు మోడీజీ ఎందుకు నిద్రలేని రాత్రి గడిపారు??..ఎందుకు ట్రంప్.. ఎమ్మాన్యుల్ మార్కొన్..షింజే అబే ..నెతన్యాహు లు హాట్ లైన్లో 6 గంటలపాటు ఎంగేజ్ లో ఉన్నారు??

లడఖ్ నుండి చైనా ఎందుకు వైదొలిగింది?…

మూడు దేశాల కుట్ర…

నిజానికి మోడీజీ పెద్ద యుద్ధాన్ని వాయిదా వేశారు. పాకిస్తాన్, మనం సెమీ మిత్రదేశంగా భావించే ఇరాన్ మరియు చైనాలు భారత్ మీద అతిపెద్ద యుద్ధానికి పూర్తిస్థాయిలో  సన్నాహాలు చేశాయి. – మొత్తం కుట్ర వివరాలు!!..

జూలై 5 నాడు చైనా, పాకిస్తాన్, ఇరాన్ సంయుక్తంగా భారతదేశంపై దాడి చేయడానికి పూర్తి సన్నాహాలు చేసుకున్నాయి.

3 రౌడీ రాజ్యాలూ ఏకకాలంలో దాడి చేసే వ్యూహం పన్నాయి. దాని  ప్రకారం ముందుగా పాకిస్తాన్ సైన్యం కాశ్మీర్‌పై దాడి చేయాల్సి ఉందని నిర్ణయించారు.

పాక్ సైన్యానికి సహాయం చేయడానికి చైనా సైనికులు పాకిస్తాన్‌కు చేరుకున్నారు.

కానీ ఇండియన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (రా) మరియు సిఐఎ మరియు మన ఆత్మబందువు ఇజ్రాయెల్ మొసాద్ లకు  ఈ దాడి గురించి పూర్తి వివరాలు ఏజెంట్లు అందచేశారు. వెంటనే కేంద్రంలోని జాతీయవాద ప్రభుత్వం అప్రమత్తమైంది.

భారత సైన్యం యుద్ధానికి  పూర్తిగా సిద్ధం అయింది.

ఢీ అన్న మోడీ…

సరిహద్దులలో ప్రధాని మోడీ

వెంటనే ఏరోజైతే దాడికి 3 దేశాలూ ముహూర్తం పెట్టుకున్నాయో ఆ 5వ తారీఖునే రక్షణరంగ నిపుణులు, వ్యక్తిగత వైద్యులూ ఆరోగ్యరీత్యా అంత ఎత్తైన ప్రదేశానికి వెళ్లకూడదు అని వారిస్తున్నా ప్రధాని మోడీజీ  లడఖ్ చేరుకుని  సైన్యానికి పూర్తి స్వేచ్ఛను ఇచ్చి మానసికంగా వారికి కొండంతబలాన్ని ఇచ్చి అదేసమయంలో  చైనాను కూడా హెచ్చరించారు. నేరుగా షాంగై, బీజింగ్ వంటి ప్రధాన నగరాలపైకి అణ్వాయుధాలు అమర్చిన మిస్సైల్స్ గురిపెట్టబడ్డాయ్.

థాంక్స్ టు ఇజ్రాయెల్…

ఇక మొస్సాద్ రంగంలోకి దిగింది. భారత్ మీద దాడి జరగకముందే, ఇజ్రాయెల్ జూలై 5 తెల్లవారుజామున ఇరాన్‌ అణ్వాయుధ కేంద్రంపై దాడి చేసి  ఇరాన్‌ ఎప్పటినుంచో కాపాడుకుంటూ వస్తున్న అణ్వాయుధాలనన్నింటినీ నాశనం చేసింది.

ఇరాన్ బ్లాస్ట్

అవసరంలో అక్కరకు వచ్చింది ఇండో ఇజ్రాయెల్ స్నేహం. మోడీ దౌత్యం, నెతన్యాహుకు భారత్ మీద ఉన్న ప్రేమ వల్ల మొస్సాడ్ ఈ భయంకరమైన దాడి చేసింది. ఆఖరకు ఎక్కడో ఇజ్రాయెల్ డిఫెన్స్ వర్గాల్లో తప్ప ఈ వార్తను ఇతరత్రా ఎక్కడా రాకుండా కట్టడి చేయగలిగారు.

భారత జలాంతర్గాములు (ఫైల్ ఫోటో)

మరోవైపు, భారత జలాంతర్గాములు అణ్వాయుధాలతో కరాచీకి అతి సమీపంలోకి చొచ్చుకువెళ్లి మోర్స్ కోడ్ కోసం నిరీక్షిస్తున్నాయి. పాక్ ఒక్క తప్పటడుగు వేసినా పాకిస్తాన్ ను పాతరాతియుగంలోకి పంపడానికి శత్రుభయంకరులైన భారత నావికాదళం సిద్ధమైంది. ఉప్పందుకున్న పాక్ మిలిటరీ అధికారులు కాశ్మీర్‌పై దాడి చేయడానికి నిరాకరించారు. ఒకవేళ దాడి అంటూ చేస్తే భారత్ ఒకేసారి అనేక వైపుల నుండి దాడి చేయడానికి సిద్ధంగా ఉందని ఐ‌ఎస్‌ఐ పాకిస్తాన్‌ అధినాయకత్వానికి తెలియజేసింది. ఇది పాకిస్తాన్ అంచనా వేయలేదు.

సూపర్ పవర్స్ ఎంట్రీ…

మోడీజీ అప్పటికే భారత్ మీద వారికున్న నమ్మకంతో సూపర్ పవర్స్‌ ను తన దౌత్యనీతితో ఏకంచేసి భారత్ కు మద్దతుగా తీసుకురాగలిగారు. అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, రష్యా అందరూ మోడీజీతో కలిసి నిలబడ్డారు.

అమెరికా తన యుద్ధ నౌకలను దక్షిణ చైనా సముద్రంలో సిద్ధంగా ఉంచింది. విషయం పూర్తిగా అర్ధమైన  చైనా భారత్ తో చర్చలకు ప్రయత్నించింది.

దక్షిణ చైనా సముద్రంలో అమెరికా యుద్ధ నౌకలు

ఈసారి సంభాషణల బాధ్యతను అజిత్ దోవల్ (పిఎం జాతీయ భద్రతా సలహాదారు)కు అప్పగించారు. చైనా అజిత్ దోవల్ తో చర్చలకు ముందు నిరాకరించింది.

నేరుగా జిన్ పింగ్ మోడీజీతో మాట్లాడాలని అనుకున్నారు. కానీ మోడీ మాట్లాడటానికి నిరాకరించారు. తప్పనిసరి పరిస్థితిలో  చైనా విదేశాంగ మంత్రి దోవల్‌తో మాట్లాడవలసి వచ్చింది. అజిత్ దోవల్ గారి స్థాయి  చైనా విదేశాంగ మంత్రి కంటే తక్కువ కనుక భారత విదేశాంగ శాఖా మంత్రి జయశంకర్ గారితో మాట్లాడతామని చైనా ప్రతిపాధించిది. భారత విదేశాంగ శాఖ సింపుల్ గా మాట్లాడితే అజిత్ దోవల్ గారితో మాట్లాడండి. లేకుంటే లేదు. అని స్పష్టంగా నోట్ పంపింది. చైనా ఈ అవమానాన్ని దిగమింగుకొని అజిత్ దోవల్ గారితో చర్చలకు ఒప్పుకుంది.

జూలై 5 న చైనా, ఇరాన్ మరియు పాకిస్తాన్ లు భారత్ మీద చేయాలనుకున్న  సామూహిక దాడి బ్లూ ప్రింట్ ను చైనా విదేశాంగ మంత్రికి అజిత్ దోవల్ అందజేశారు. దాంతో చైనా నోట్లో పచ్చివెలక్కాయ పడ్డంత పనైంది. ఇక తప్పనిసరి పరిస్తితిలో  వారి సైన్యాన్ని వెనక్కు పిలవడానికి అంగీకరించింది. ఇంక భవిష్యత్తులో దాడి చేయనని హామీ ఇచ్చింది.

ఖేల్ ఖతం..

చైనా పాకిస్తాన్‌ను ఒంటరిగా వదిలివేసిందని  ఇప్పుడు పాకిస్తాన్ చైనాపై కోపంగా ఉంది. అలాగే ఇరాన్ తమ ముసుగు తొలగిపోయి ఒరిజినల్ దుర్బుద్ధి బయటపడిందని లోలోన కుతకుతా ఉడికిపోతోంది. మొత్తానికి అందరూ తెలు కుట్టిన దొంగల్లా మిన్నకుండిపోయారు.

మోడీజీ సరిహద్దుల్లో యుద్ధం చేయకుండానే గెలవడం, ఉద్రిక్తలను నివారించడంతో భారతదేశ ప్రతిపక్షం ( చైనా ఏజెంట్లు ) కూడా కోపంగా ఉన్నారు. ఎందుకంటే వారికి కావలసిన సమాచారాన్ని ప్రభుత్వం ఇవ్వలేదు. దాంతో వాళ్ళ యజమాని కూడా వీళ్ళని పచ్చిబూతులు తిడుతున్నాడు. ఒకవేళ యుద్ధం అంటూ  జరిగితే, చైనా దాడి మోడీజీ లేదా మోడీజీ  భక్తుల పైన మాత్రమే కాదు, మొత్తం భారతదేశం మరియు భారతీయులపై ఉంటుందన్న విషయాన్ని భారతదేశంలోని కొన్ని మూర్ఖ ప్రతిపక్ష పార్టీలు మర్చిపోయాయి.

చైనా దళాలు వెనుదిరుగుతున్న దృశ్యం

మోడీజీ దౌత్యపరంగా ప్రపంచంలోని అగ్రరాజ్యాలతో స్నేహం కుదుర్చుకొని ఉండకపోతే??? అలాగే సైన్యాన్ని సదా సిద్దంగా ఉంచకపోతే??? ఈపాటికి భారత్ సరిహద్దుల్లో మాత్రమే కాదు, గ్రామాలు, నగరాలలో సైతం మనమధ్యే ఉన్న దేశద్రోహులు పేల్చే బాంబులు, బుల్లెట్లతో రక్తం ఓడుతూ ఉండేది.

ప్రధాని మోడీజీ దౌత్యనీతికి, ధైర్యసాహసాలకు, .ప్రాప్తకాలజ్ణతకూ ధన్యవాదాలు. ఆయన దౌత్యం కారణంగా, ఈ రోజు మనం చైనా, ఇరాన్, పాకిస్తాన్ లతో పోరాటంలో విజయం సాధించాము. అదీ ఒక్క నెత్తుటి చుక్క రాలకుండా. వాళ్ళను బ్రతిమాలో, బామాలో కాదు. భయపెట్టి, బలవంతంగా వెనక్కి నెట్టాము. కొసమెరుపు ఏంటంటే… పాము ఎన్నటికీ పామే అని ఛైనా, పాకిస్తాన్లే కాదు ఇరాన్ కూడా నిరూపించుకుంది.

జైహింద్… భారత్ మాతాకీ జయ్…

– అవ్వారు శ్రీనివాసరావ్,

[ఈ వ్యాసంలో వ్యక్తపరచిన అభిప్రాయాలు, సమాచారం, సంఘటనలు పూర్తిగా వ్యాసకర్త వ్యక్తిగతం]

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.